ప్రతి ఓటమి- ఓ గెలుపే;- డా.నీలం స్వాతి,చిన్న చెరుకూరు గ్రామం,నెల్లూరు.6302811961.
 విశాలమైన మన ఈ
భూమండలంలో విభిన్న మనుషులు...
విభిన్న వ్యక్తిత్వాలను కలిగి ఉండడం సహజమే...
ఫలితాన్ని ఆశించి ప్రయత్నాన్ని ప్రారంభించే వాళ్ళు కొందరైతే....
ప్రయత్నాన్ని ప్రారంభించకుండానే ఫలితాన్ని కోరుకునే వాళ్ళు మరికొందరు...
ఫలితమే లేకుండా ఏ పనీ చేయని వారు కొందరైతే....
అసలు ప్రయత్నమే చేయనివారు మరికొందరు...
నిజానికి ఎవరి ఆశయాలు వారివే...
ఎవరి ఆలోచనలు వారివే...
ఒక్కరిది తప్పు మరొకరిది ఒప్పు అని చెప్పగలిగే అధికారం ఏ ఒక్కరికి కూడా లేదు...
కానీ ఈ రోజులలో.... ప్రయత్నం ముందుకు సాగక ప్రయత్నంలోనే
ప్రయత్నంగానే ఆగి పోతుంది.... 
అందుకే కొంచెం బాధగా వుంది...
ఓ ప్రయత్నాన్ని మనం ప్రారంబించేటప్పుడు
ఫలితాన్ని ఆశించడంలో తప్పు లేదు...
ప్రయత్నాన్ని, ఫలితాన్ని
గెలుపు ఓటములకు ముడిపెట్టి మనం మన ఆలోచనలకు 
ఆశయాలకు దూరాన్ని మరింతగా పెంచేస్తున్నాము...
ప్రయత్నం ఫలించనప్పుడు కనీసం పరామర్శించని వారు
అదే మన ప్రయత్నం ఫలిస్తే ఎదురువచ్చి మనను పలకరిస్తారు...
మనదైన ఈ ఒంటరి ప్రయాణంలో
ప్రయత్నం-ఫలితం మనదే అయినప్పుడు వేరొకరి ప్రశంస విమర్శ మనకు అవసరం లేదు...
ఇక ఫలితాల పరంపరల విషయానికి వస్తే...
అందినప్పుడు అనుభూతిని...ఆనందంతో, పొందనప్పుడు
అనుభవాన్ని...ఆలోచనతో
సమానం చేసుకుంటూ సాగిపోవడమే కదా జీవితం...
మనకు ఆశించిన ఫలితం రాకపోతే మన ప్రయత్నమే లోపం అని అందుకు అర్ధంకాదు...
పాల నుంచే పెరుగు, వెన్న, నెయ్యి వస్తాయి....
అన్నిటికి ఆధారం ఒకటే అయిన ఆలోచనల వలన, ఆచరించే విధానాల మార్పుల చేర్పుల
వలన కేవలం పరిమాణాలలో వ్యత్యాసమే కాదు,వాటి విలువ కూడా పెరుగుతుంది...
అలాగే

ఫలించని ప్రయత్నాన్ని వినూత్నంగా ప్రయత్నించి చూద్దాం...
ప్రతి ఓటమి ఓ గెలుపవుతుంది...
ప్రతి గెలుపు- ఓ వేకువ పిలుపవుతుంది...

కామెంట్‌లు