చైతన్యం;- \డా.నీలం స్వాతి,చిన్న చెరుకూరు గ్రామం,నెల్లూరు.6302811961.
 కవులం మేము...కవులం మేము...
అంశం ఏది అయినా సరే, వెను తిరగక ముందుకు సాగే బాటసారులం మేము...
ఊహలను చేతులకు అందించి, అందమైన అక్షరాలుగా తీర్చిదిద్దే శిల్పకారులం మేము…
భావాలతో ఆకాశాన్ని అందుకోవాలని, అలలా ఎగసిపడే ఆశాజీవులం మేము...
పక్షపాతం లేకుండా మదిలోని ఆలోచనలను, ఖచ్చితంగా చెప్పగల వీరులం మేము...
కలంతో స్నేహం చేస్తూ కాలాన్నిఏ మాత్రం లెక్క చేయని, శ్రమజీవులం మేము...
సుదీర్ఘ అక్షర యాత్రలో ఏళ్ళు గడిచినా సరే చిరు అభినందనకు మురిసి పోయే చిన్న పిల్లలం మేము...
అలాంటి కవులందరూ చైతన్యం రావాలని కోరుకునే అంశాలు ఇవి...
కలంతో కడుపు నిండదు అన్న మాటల తీరులో రావాలి చైతన్యం అని...
కవితలు అంటే ఏదో నాలుగు పేజీల వ్యాకరణం అన్న చిన్న చూపును ఆపే దిశగా రావాలి చైతన్యం అని...
కవి సమ్మేళనాలు అంటే వెనుకకు తగ్గే అడుగులలో రావాలి చైతన్యం అని...
అద్భుతమైన తెలుగు ఉచ్చారణ విని మ్రోగక మౌనంగా ఆగిన చేతులలో రావాలి చైతన్యం అని...


కామెంట్‌లు