ఆత్మరక్షణ;-డా.నీలం స్వాతి,చిన్న చెరుకూరు గ్రామం,నెల్లూరు.6302811961
 ఈ జీవితం భద్రత లేనిది అని ప్రతి ఒక్కరూ  భావిస్తారు. ఈ భద్రత ఎక్కడ నుంచి వస్తుంది ఎలా వస్తుంది  ముందు నీ మనోబలం  నిబ్బరంగా ఉండి ఏ కష్టం వచ్చినా ఏ నష్టం వచ్చినా ఏ బాధ వచ్చినా నేను ఓర్చుకోగలను నాకా ధైర్యం ఉంది  అనుకున్న వారికి ఎవరికైనా  బాధ ఉంటుందా  మనం  ఉదయం లేవగానే పత్రిక గాని ఏ మాధ్యమం చూసినా అనేక దుర్వార్తలు తప్ప మంచి వార్త ఒక్కటీ రాదు  ఐదు ఆరు సంవత్సరాల బాలికను  ఒక యువకుడు బలవంతం చేశాడని, ఒక యువతి ఏకాంతంగా వెళుతున్న సమయంలో ఆమెను భయపెట్టి లొంగ తీసుకున్నారని, వివాహితను  బలవంతం చేసి తన కోరికను తీర్చుకున్న తరువాత  ఆమెను బలవంతంగా చంపారని వార్తలు మనం వింటూ ఉంటే చలించి పోతాం. భయానికి లోనవుతాం. అంతేకానీ ఆ పరిస్థితులను కానీ  ఆ సంఘటన జరగడానికి కారణాలు గురించి కానీ మనం ఆలోచించం మగవాళ్లంతా ఎక్కువ బలం కలిగిన వారని ఆడవాళ్లంతా అబలలు  అన్న అపప్రద  ఈ లోకంలో ఉంది. మనం ఇంట్లోనే ఉంటాం. బలం, బలహీనత ఎక్కడ ఉన్నాయి ఎలా వస్తాయి. మనం ఎలా సాధించవచ్చు అన్న విషయాన్ని గురించి ఏ ఒక్కరైనా ఆలోచించారా ఆడపిల్లలు  మీరంతా, మాటా మాటా పెరిగి ఇద్దరూ పోట్లాటకు దిగినప్పుడు  ఎవరికి ఎక్కువ బలం ఉంటే వారు గెలవడం  తెలుసు కదా. అలాకాకుండా బలాన్ని ఉపయోగించకుండా తెలివిని ఉపయోగించి గెలిస్తే అది ఎంత ప్రయోజనంగా ఉంటుంది. నువ్వు బస్సులో బడికి వెళుతున్నావు నిన్ను ఎవరో అంటరాని చోట చేతులు వేస్తాడు. మాటలతోకాకుండా నీ బుద్ధి తో వాడికి జ్ఞానం రావాలి. నీ దగ్గర ఉన్న పెన్సిల్ ముక్కుతో కానీ  పిన్నీసుతో గాని ఒక్కసారి వాడిని పొడిచినట్లయితే  మళ్లీ నీ జోలికి రాడు. ఇవాళ నా దృష్టిలో మీరందరూ కూడా కరాటే నేర్చుకునే ఉండాలి  నేర్చుకున్న మీరు ఒక్కొక్కరు మరొకరికి  పాఠంగా చెప్పాలి  మీ దగ్గర నేర్చుకునే విద్యార్థిని మరొకరిని తయారు చేయాలి  అలా ఎవరికి వారు వారిని రక్షించుకునే స్థితిలో వారు ఉన్నప్పుడు  అవతలివాడు ఎంత బలాడ్యుడైనా నీ విద్యకు దాసోహం అని తీర వలసిందే నేను వాడిని గెలవడం నాకేం చేతనవుతుంది  నేను నేర్చుకోగలనా  అనుకుంటే అది అసాధ్యమై కూర్చుంటుంది  నీవు వాట్సాప్ నేర్చుకునేటప్పుడు ఇన్ని పాఠాలు నేర్చుకుంటాను  ఇన్ని చదువుకుంటాను ఇన్ని తెలుసుకుంటాను అని ఊహించావా  గురువు ఉంటే ప్రతిదీ సాధ్యమే అన్న విషయాన్ని జ్ఞాపకం పెట్టుకో  నిన్ను నీవు కాపాడుకోవడానికి కూడా గురువు ద్వారానే ఆ విద్యను నేర్చుకోవాలి  అప్పుడు తలెత్తుకొని ధైర్యంగా అర్ధరాత్రి తిరిగినా నీకు ఎలాంటి అపకారం జరగదు  ఇది స్పష్టం  అలా తయారు కావడానికి మీరందరూ సిద్ధమే కదా  రేపటి నుంచి మీ అందరికీ కరాటే నేర్పుతాను నేను... బి రెడీ...!


కామెంట్‌లు