ప్రకృతి ప్రసాదం; యలమర్తి అనూరాధ-హైదరాబాద్ -చరవాణి:924726౦206
నామీద ఎంతో ప్రేమతో
దూసుకు వస్తున్న వాయిదేవుడు

మెరుపుల సంద్రంలో మురుస్తున్న
అందమైన ఆకాశరాజు

సంతోషంతో ఊగుతూ 
ఊసులు చెబుతున్న వృక్ష సముదాయం

ఓర్పుగా నేర్పుగా భరించే 
సహనశీలి భూమాత

వేసవిలో చిరుజల్లుల తలంబ్రాలు
చినుకుల సందడి ముంగిట్లో

మదిన సంతోష తరంగాలను కురిపిస్తూ
అనుక్షణం ప్రకృతి ప్రసాదించే ఆనందం

ఇంతకంటే ఇంకేం కావాలి?





కామెంట్‌లు