గాలిపటాలు చేసేటి పిల్లలం
గోలి మిఠాయిలు మోసేటి మల్లెలం
వాడ వాడల్లో వాటిని విక్రయిస్తాం
గోడ నీడల్లో సేదతీరి విశ్రమిస్తాం !
మేళం పాటలంటే మాకిష్టం
వేలం పాటలైతే బహు కష్టం
కోలాటం మా బాగా వేస్తాం
గలాట లేకుండా మేం చూస్తాం!
డింగు డాంగు పాటలు పాడుతాం
రింగు బాలు ఆటలు మేం ఆడుతాం
మేం పాటల్లో ఆరితేరిన వారలం
మా పోటి ఆటల్లో కోరి చేరిన పోరలం!
అడుగుడు ఆటలు కూడా ఆడుతాం
గుడు గుడు గుంజం పాటలు పాడుతాం
ఆటపాటలతో కలుగు మాకు ఆరోగ్యం
వాటితోనే మాకు వెలుగు మహాభాగ్యం!
గమ్మత్తైన పాటలు పాడుతాం
చిత్తుబొట్టు ఆటలు ఆడుతాం
ఆటపాటల్లో ముందుకు సాగుతాం
ప్రతిభ పాటవాల్లో మేం చెలరేగుతాం!
తడబడు అడుగులు వేస్తూ
అడుగుడి మా బడిలో మస్తు
అల్లిబిల్లి ఆటలు ఆడుతాం
పాలవెల్లి పాటలు పాడుతాం!
మా ఆటలతో అందరిని అలరిస్తాం
మేం పాటలతో వారిని మురిపిస్తాం
పోటి ఆటలను కూడా జరిపిస్తాం
మేటి బహుమతులను ఇప్పిస్తాం !
మా ఆటపాటల ఆనందంతో
తెలివితేటల అనుబంధంతో
తక్షణమార్గం ఇక మేం శోధిస్తాం
మా అక్షర యజ్ఞాన్నీ జరిపిస్తాం !
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి