ఆదర్శ వ్యక్తి- రంగారెడ్డి;- ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322
 గ్రామపంచాయతీలో ఆ గ్రామ అధ్యక్షునిగా ఉండడానికి గాని  రాష్ట్రానికి సంబంధించి దేశానికి సంబంధించి లేదా ప్రపంచానికి సంబంధించి  పరిపాలనకు సంబంధించిన విషయాలను  మనం చెప్పుకోవాలంటే  పరిపాలనా దక్షత కలిగిన వ్యక్తి మన ముందుకు రావాలి. అతని వ్యక్తిత్వం బాగుండాలి  మానసిక వైకల్యం లేకుండా ఉండాలి ఏదైనా ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు  తన  సహ ఉద్యోగులతో మంత్రులతో సంప్రదించి  దానివల్ల మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా అన్న విషయాన్ని కూలంకషంగా చర్చించి నిర్ణయానికి రావాలి  ఇవన్నీ చేయగలిగిన వారు ఎవడైతే ఉంటారో  వారిని మంచి పరిపాలకుడిగా  ప్రజలు  గౌరవిస్తారు. అలాంటి వ్యక్తులలో  ప్రజల అందరి ప్రశంసలకు పాత్రులైన వారు కొండా వెంకట రంగారెడ్డి గారు  వారి గురించి రెండు విషయాలు తెలుసుకుందాం.
కొండ అన్న శబ్దం ఉన్నత తత్వానికి గాంభీర్యానికి ఆశ్రయానికి స్థిరత్వానికి ప్రతీక  వెంకట రంగారెడ్డి గారి ఇంటి పేరు కొండ  పేరులోనే ఉన్నది పెన్నిధి. పెన్నిధి అంటే పెద్ద న
నిధి దేనికి పెద్దది అంటే వీటికి నిర్వహణకి కర్తవ్యపాలనకి కార్యాచరణకి  ధర్మాచరణకి దాతృత్వానికి దూర దృష్టికి రంగారెడ్డి గారు నీధి వంటి వారు  వాటికి కూడా ప్రతినిధి నిష్కళంక దేశభక్తుడు దిన జనబాంధవుడు తెలంగాణ ప్రజల హృదయాలలో నిలిచిన మహనీయుడు. హోం శాఖామంత్రిగా మద్యనిషేధ శాఖ మంత్రిగా రెవిన్యూ శాఖ మంత్రిగా  ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన రాజకీయ దురంధరుడు  రంగారెడ్డి జిల్లా నామకరణానికి కారణభూతుడైన ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా గొప్ప పరిపాలనా దక్షత ఘన చరిత్ర కలిగిన  మర్రి చెన్నారెడ్డి గారు మేనమామ. ఆంధ్రప్రదేశ్ చీఫ్ జస్టిస్గా సుప్రీంకోర్టు జడ్జిగా పనిచేసిన కొండా మాధవ రెడ్డి గారి పితృపాదులైన కొర్ల వెంకట రెడ్డి గారు  హైదరాబాద్ సమీపంలో అప్పటి అప్పరావు  జిల్లా పెద్ద మంగళూరు గ్రామంలో నేటి రంగారెడ్డి జిల్లా 1890 డిసెంబర్ 12న మధ్యతరగతి కుటుంబంలో చెన్నారెడ్డి, బుచ్చమ్మ దంపతులకు వారి పుణ్యఫలాల పంటగా జన్మించారు. పుష్పించిన పారిజాత కుసుమమై ఆంధ్రుల అదృష్టంగా రంగారెడ్డి గారు సద్వంశ సంజాతకుడు బహు దొడ్డవాడు. వారి తాత ఎల్లారెడ్డి గారికి ఐదుగురు కుమారులు ఉన్నారు  వీడి తండ్రి చెన్నారెడ్డి గారు వ్యవహార దక్షతతో కొడుకును సత్యమునిగా సద్గుణ సంపన్నునిగా, విద్యావేత్తగా న్యాయవాదిగా  రాజకీయ చతురునిగా తీర్చిదిద్దిటంలో అద్వితీయుడు  రంగారెడ్డి గారికి నారాయణరెడ్డి అనే సోదరుడు ముగ్గురు చెల్లెలు ఉన్నారు.




కామెంట్‌లు