వ్యక్తి సమాజంలో.;- ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.
 వ్యష్టిగా ఈ ప్రపంచంలోకి వచ్చి  వివాహమై వ్యక్తి గా మారిన తరువాత సమస్య కోసం సమాజంలో చేరి  ఒకరి కోసం నలుగురు నలుగురు కోసం ఒకరు అన్న సిద్ధాంతానికి కట్టుబడి పని చేయడానికి సిద్ధమై  జీవితాన్ని కొనసాగిస్తున్న వ్యక్తి  ఎన్ని రకాల మనస్తత్వాలు కలిగిన వ్యక్తులతో  పరిచయాలు ఉంటాయి  స్త్రీ పురుష భేదాలు కూడా లేకుండా  అందరినీ కలగలుపు కొని తిరిగే వ్యక్తికి  ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి. తన ప్రక్కన ఎంతో మంచి వాడిగా నటిస్తూ ఎన్నో హత్యలకు పాల్పడి ఎన్నో గూండా పనులకు  కారణభూతులైన వాళ్లు స్నేహితులుగా ఉండకపోరు వారితో ఎలా ప్రవర్తించాలి  వారిలాగా ఉండాలా ధర్మాన్ని పాటిస్తూ మంచి వాడిగా జీవించాలా  పరిస్థితుల ప్రభావం మీద ఆధారపడి ఉంటుంది. తనతో స్నేహితుడిగా నటిస్తూ  తనకు అతి సన్నిహితంగా ఉన్న యువతులలో అందరూ మంచిగానే ఉంటారని అనుకోకూడదు  వయసుకు సంబంధించిన కొన్ని ప్రలోభాలు వారిలోన ఉండి తీరతాయి  అలాంటివి ఎదురైనప్పుడు  నిజాయితీగా సమస్య సమాజంలో  బ్రతకాలనుకున్న వ్యక్తి ఏం చేయాలి  ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి  ఆమె కోరికను తీర్చి తను కూడా తిరుగుబోతుగా సమాజంలో ముద్ర వేయించుకోవాలా లేక నేను చెల్లిగా చూస్తున్నాను  చెడుగా నిన్ను ఎప్పుడు ఊహించుకోలేదు అని చెప్పితే ఆ యువతి  కామంతోరెచ్చిపోయి  తనను మానభంగం చేశాడని అనేక రకాలుగా హింసించాడని  సమాజంలో ప్రచారం చేస్తూ  తన అక్కస్సు తీర్చుకుంటే  అతని పరిస్థితి ఏమిటి.
దీనికి వేమన చక్కని ఉదాహరణ చెప్పాడు మనిషిని హంసతో పోలుస్తూ  హంస ఆకాశవీధిలో ఎగురుతూ  అక్కడ సరస్సులో ఎదుగుతున్న సమయంలో కూడా  ఆ నీటిని ఒక గుక్కెడు కూడా రుచి చూడదు. మనం సమాజంలో ఉంటూ  సమాజం కాకుండా ఉంటే తామరాకు మీద నీటి బొట్టులా ఉన్న తత్వాన్ని అర్థం చేసుకుంటే  తాను ఉత్తమ పౌరుని లాగా సజ్జనులాగా  ప్రజల చేత కొని యాడ బడతాడు తప్ప  సమాజంలో తనకు ఎదురవుతున్న అనేక ప్రలోభాలకు లోనై  వాటికి దాసుడు అయితే ఎందుకూ పనికిరాకుండా పోతాడు అన్న నీతిని చెప్పడానికి ఈ   పద్యాన్ని వ్రాశాడు వేమన దానిని ఒక్కసారి చదవండి  ఆటవెలదిలో ఉన్న సొగసు ఏమిటో తెలుస్తుంది.

"హంస మానసోడమంటక తిరిగిన యట్లు గర్మ చేయము నంటకుండు యాగి తిరుగు సకల భోగంబుతోడను...."

కామెంట్‌లు