ఎవరి పుణ్యం వారిదే;- ఏ బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.
 సనాతన ధర్మానికి వేమన వ్యతిరేకం అని చాలామంది అనుకుంటారు కానీ ధర్మాన్ని విడిచి వేమన ఎప్పుడూ ఎక్కడా ఎలాంటి విషయాన్ని మన ముందు ఉంచలేదు  మానవునిలో ఉన్న బలహీనతలను ఎత్తిచూపి  వాటిని బలంగా చేసుకున్నట్లయితే  దుర్లక్షణాలు పోయి మంచి లక్షణాలు ఏర్పడతాయి అన్న సదుద్దేశంతో  తన ఆటవెలది పద్యాలను వ్రాయడానికి  ఉపక్రమించాడు  వేల సంఖ్యలో మనకు అందించిన పద్యాలను ఒక్కసారి మననం చేసుకున్నట్లయితే  ఎవరు ఏ పని ఎలా చేయాలి  ఎవరి పని వారు చేయాలి తప్ప మరొకరి పైకి నెట్టకూడదు  పరాయి అధికారాలను తనపై వేసుకుని  చలాయించినవాడు ఎవడూ  సుఖమైన జీవితాన్ని గడప లేడు  అన్న విషయాలను కూలంకషంగా చెప్పగలిగిన మేధావి వేమన. ఉమ్మడి కుటుంబాలలో ఆ కుటుంబ పెద్ద ఏది చెపితే మిగిలిన అందరూ కూడా ఆ పనిని తప్పకుండా అమలు చేస్తారు  వాడు చెప్తే నేను చేసేది ఏమిటి  నాకన్నా కొంచెం ముందు పుట్టినంత మాత్రం చేత  నాపై అధికారం చేలాయించడానికి అతను ఎవరు అన్న దృష్టి  ఆ రోజుల్లో ఎవరికి ఉండేది కాదు  తల్లిదండ్రులను దేవతా స్వరూపులుగా ఎంచి  పెద్ద ఏది చెబితే దానిని తూచా తప్పకుండా  చేసి చూపించడం  వారి విధ్యుక్త ధర్మంగా  భావించారు తప్ప అదేదో వెట్టి చాకిరి అన్న దృష్టితో కాదు  పెద్దలకు తెలియకుండా దానధర్మాలు చేయడానికి కూడా వీరు అంగీకరించరు  ఏ పని చేసినా పెద్దలకు తెలిసేలా వారికి చెప్పి వారు చేయమంటేనే దానిని చేస్తారు తప్ప సొంత అభిప్రాయాలతో వారు ఏర్పాటు చేసుకోరు.
ఇంటి పెద్ద చెప్పిన పనిని చేస్తే ఆ పనికి  ప్రతిఫలంగా వచ్చే పుణ్యం ఆయనకే దక్కుతుంది  అది నాకు దక్కదు అన్న భేద అభిప్రాయాన్ని  వారు ఎప్పుడూ వ్యక్తపరచలేదు  ఉమ్మడి కుటుంబం కదా ఏది చేసినా అందరికీ సమానంగానే వస్తుంది అన్న అభిప్రాయం తప్ప వేరే ఏమీ లేదు  కానీ వేమన చెప్పే నీతి వేరుగా ఉంది  అన్న చేసిన పనికి ఫలితం తమ్ముడు కి రమ్మంటే ఎలా వస్తుంది. రాదు కదా. తన కాలు కోసుకున్నాడు అనుకుందాం  ఆ కాలిబాధ తనకు తెలుస్తుందా తన అన్నకు తెలుస్తుందా  కనుక ఎవరు చేసిన మంచి పనికి వారికే ఆ పుణ్యం దక్కుతుంది తప్ప మిగిలిన వారికి కాదు అని  చాలా స్పష్టంగా చెప్పాడు వేమన  ఆ వేమన  రాసిన పద్యం చదివితే  ఆ విషయం మీకు పూర్తిగా అర్థమవుతుంది  ఒకసారి ఆ పద్యాన్ని చదవండి.
తనదు భ్రాతలెల్ల దానంబు చేయగా తనకు ఫలమటంచు దలచరాదు 
తనదు కాలుగోయ తన తమ్ముడేడ్చునా...."

కామెంట్‌లు