చప్పట్లు;- డా.భోజన్నగారి అనసూయ. నిజామాబాద్ 99898 22494
 మీ చప్పట్లే వక్తకి ఉత్సాహం
ఈ మాట విన్నపుడల్లా నాకు అనుమానం
వక్త తర్వాతిమాటలు మారిపోతాయనో
చెప్పాలనుకున్నది వేరేగా చెప్తాడనో
అనవసర మాటలు దొర్లుతాయనో
అందరం సరిగా వినలేకపోతామనో
సమయం కొద్దిసేపు ఆగిపోతుందనో
ఏమో... సభల్లో మాత్రం మహాస్త్రాలుగా
మళ్ళీ మళ్ళీ అడిగి వినిపించమనేవి 'కైతట్టులు'
                         

కామెంట్‌లు