బెల్లం కొట్టిన రాయి:-
రాయిని దేనితో కొట్టిన చప్పుడు అవుతుంది. కానీ అదే రాయితో బెల్లం ముద్దను కొడితే చప్పుడు రాదు. సర్వసాధారణంగా రాయితో రాయిని మోదీనా రాయితో ఇనుమును కొట్టినా నిప్పు రవ్వలు కనపడుతాయి.కానీబెల్లం కొట్టిన రాయితో మోదితే రవ్వలు రాలవు. సవ్వడి రాదు. తెలివి తక్కువ వాళ్ళను, సోమరులను, ఈపదా లతొ పోలుస్తారు. ఇటువంటి వాళ్ళు కూడా ఎప్పుడో ఒకప్పుడు చలిస్తారు. ఈ రాయి లాంటి వాళ్ళుకు కద లరు. మారు మాట్లాడరు. అందు చేత ఏ మన్న ఏమి చేసినా పట్టించుకోని, ఎదురు తిరగని వాళ్ళను బెల్లం కొట్టిన రాయిలా వున్నారని అంటారు. వీరు శుద్ద బుద్దా వతా రా లు.
తెలుగు జాతీయం.;- తాటికోల పద్మావతి గుంటూరు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి