నీరవ నిశీధికి తరువాయి
నిశ్శబ్ద విస్ఫోటనం
నిశ్చల నీలి గగనంలో
నిరుపమాన కాంతి పుంజము
సుజలాలతో సుఫలాలతో
సుసంపన్నమైన వసుమతిలో
సస్య కేదారాల సుస్వరాల
సుమధుర గాన నాట్యాలు.
ప్రాణాధారమైన ధాన్యం
ప్రసవించే పంట పైరుల
అవ్యక్త ఆనంద భావాలు
అర్థమయేలా చలనాలు
జీవాధారమైన జలాలను
పుడమికి అందించు
జలధరాల కదలికల మధ్య
దూసుకు వస్తోన్న కిరణప్రభలు
అనుదినం అనునయంగా
ఆగమించే వేకువకు
ఏది ఎపుడు చేతికి
అందించాలో ముందే నిర్ణయాలు
ఆశలు ఆకాంక్షలూ అందరివీ
అదృష్టాలూ అవకాశాలు కొందరివే!
అలుపెరుగని పోరాటాలలో
గెలుపు ఓటములు దైవాధీనాలు
గెలిచే ప్రయత్నంలో
ఓటమికూడా ముందడుగే!
జీవిత గమనంలో
స్వప్నాలు సాకారం చేసే వేకువకు
🌸🌸 సుప్రభాతం 🌸🌸
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి