రెంటికి చెడ్డ రేవడి.
రేవు అంటే పడవలు నిలిచే తీరం లేదా బట్టలు ఉతికే చోటు. రేవు అనేది ఇరవు అంటే స్థలం అని అర్థం. అన్ని కాలువలు దగ్గర, చెరువుల వద్ద ఓడలు ఉండవు. కానీ చాకి బానలు, బండలు తప్పకుండా ఉంటాయి. అందుకే గుడ్డలుతికే పేరిగాన్ని"ప్రతాప రుద్రీయం"లో రేవేలిగాడు అని పిలుస్తారు. చాకిరేవుకు రేవు అనేది సూక్ష్మరూపం.
కొన్ని గుడ్డలు ఉతికి వాటిని ఆరబెట్టి మరికొన్నిటిని ఉతుకుతుండగా పెద్ద గాలి వచ్చింది. ఎగిరిపోయే గుడ్డల కోసం పరిగెత్తేసరికి ఒడ్డున పెట్టిన గుడ్డలు కొట్టుకుపోతాయి. వాటి కోసం ఉరకలెత్తితే ఆరవేసినవి కొట్టుకుపోతాయి. మొత్తం మీద గుడ్డలు ఎక్కడ దొరకలేదు. రెండు చోట్ల గుడ్డలు పోగొట్టుకున్నాడు. ఉతికినవి దక్కలేదు. ఉతుకుతున్నవి దక్కలేదు. ఒకటికి నాలుగు పనులు నెత్తిన వేసుకుని ఏ పనిని పూర్తి చేయలేని వారిని రేవడు అంటారు. పోగొట్టుకోవడం గుడ్డలలోనే కాదు. అందరితో మంచిగా ఉండాలని ప్రయత్నించి చివరికి అందరికీ శత్రువు అయిన వారిని రెంటికి చెడ్డ రేవడి అంటారు. రెండు విధాల చెడిపోయిన వ్యక్తిని రెంటికి చెడ్డ రేవడి అంటారు.
తెలుగు జాతీయం.; -తాటి కోల పద్మావతి
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి