తక్కువ అంచనా;- కొప్పరపు తాయారు
ఎక్కువ తక్కువలు కాదు,
భావన అద్భుత సరళినుండ,
ఆచరణ అనంత ప్రక్రియలు
ఆలోచించు,

భావనలో దిగిణీ కృత నీరసం చెల్లదు!పరిగెత్తే మనిషి కాలంతో పాటు ఆలోచనల అభావన స్వభావనలు ఎక్కడ ?

కవితా ఘోషలో కాలం చాలదు 
జీవిత పరుగులలో గెలుపుకై
వెతుకులాట ఆలోచన పరంపర
ఎక్కడ?
మనకున్న సమయాన్ని సద్వినియోగ పరచ సాధించ 

వేరేది లేదు సమయం తక్కువ అవును
ప్రతి మనిషి నిజం వదిలి అబద్ధం లో హాయిగా ఊపిరి పిలిస్తే,జీవితం
ఒక సాగర మధనమే!!!

ఉన్న కాలాన్నివ్యర్థం చేయక
నిద్రలో సగం జీవితం పోగొట్టుకొని
చెప్పే కబుర్లు చేతగాని ఉవాచలు,
ఎవరో ఏదో చేయలేదని  చేస్తారని కాదు!!

చేతనున్న నిమిషాన్ని గంటగా ఆలోచించి అడుగు వేస్తే సాధించలేనిది ఏదీ లేదు స్నేహం, బంధుత్వం,సమ్మేళనాలు,
సన్మానాలు,
ఏది మనది కాదు కానీ, అడుగుల లెక్కలో తప్పులెక్క సమయాభావం సద్వినియోగపరచుకో సమయస్ఫూర్తితో!!!

కామెంట్‌లు