భలే భలే పిల్లలు;- ఎడ్ల లక్ష్మి
బలే బలే పిల్లలు
ఆటలాడే బాలలు 
నీటిలోని జెల్లలు
దేశానికే వారెల్లలు

కొమ్మ కేసిన మొగ్గలు
విరబూసే పువ్వులు
బోసి నోటి నవ్వులు
వెలిగేటి జ్యోతులు

చిట్టి పొట్టి పలుకులు
వచ్చిరాని మాటలు
వారు చేసే కేరింతలు
తెచ్చి పెట్టు నవ్వులు

తిరుగాడే పిల్లలు
నట్టింట్లో కాంతులు
పరుగులు తీసే పాపలు
మా ఇంట్లో మాణిక్యాలు


కామెంట్‌లు