అందరూ అనంగ వింటూంటాము, కానీ వాటి గూర్చి పూర్తిగా ఒకసారి తెలుసుకొందాము!!...
భగవంతునిని చేరేందుకు అంటే.. ఆ పరమాత్మలో ఐక్యమయ్యేందుకు పురాణాలు యందు మన మహర్షలు తెలిపిన మార్గాలే ఈ నవవిధ భక్తీ మార్గాలు.
ఈ నవవిధ భక్తీ మార్గాలలో దేనినైన సరే ఒకదానిని ఎంపిక చేసుకొని సరిగా అవలంబిస్తే ఆ ఈశ్వరుని చేరడం ఖాయమని ఆ మహానుభావులు ఎన్నో పురాణములలో , శాస్త్రాలలో వివరించారు ...
*నవవిధ భక్తి మార్గాలు అంటే!!...*
1) శ్రవణము
2) కీర్తనము
3) స్మరణము
4) పాదసేవనము
5) అర్చనము
6) నమస్కారము
7) దాస్యము
8) సఖ్యత్వము
9) ఆత్మనివేదనము..
*1. శ్రవణము :*
శ్రవణము అంటే భగవంతుని గురించి మరియు ఆయన లీలావిషేసాల గురించి వింటూ జీవితాన్ని సంపూర్ణంగా అధ్యాత్మికతో గడపడం.
*2. కీర్తనము :*
కీర్తనం అంటే భగవంతుని గురించి ఆయన తత్త్వం గురించి కీర్తించడం అంటే ఆయనే ఈ సమస్త లోకాలకు పాలకుడు అని ఆయన నామాన్ని కీర్తిస్తూ జీవితాన్ని సంపూర్ణంగా అధ్యాత్మికతో గడపడం.
*3. స్మరణము :*
స్మరించడం అంటే ఆ దేవదేవుడిని నిరంతరం మన మనస్సులో స్మరిస్తూ సంపూర్ణంగా అధ్యత్మికతో జీవించడం.
*4. పాదసేవనము :*
పాదసేవనం అంటే ఆ భగవంతునికి నిర్మలమైన మనస్సుతో నువ్వు సమర్పించే ప్రతిది ఆయన పాదాలకు సమర్పించడం.
*5. అర్చనము :*
అర్చనము అంటే నువ్వు చేసే ప్రతి పనిని ఆయనకు సమర్పిస్తూ ఉండడమే, దీనినే భగవంతునికి అర్చన చేయడం అంటారు.
*6. నమస్కారము :*
నమస్కారము అంటే భగవంతునిని సంపూర్ణంగా మనస్పూర్తిగా నమస్కరించడం, ఆయనను మనసార ప్రార్ధించడం.
*7. దాస్యము :*
దాస్యము అంటే భగవంతుడు ఒక అధికారిగా నువ్వు ఆయన సేవకుడిని అని భావిస్తూ జీవితాన్ని సంపూర్ణంగా అధ్యాత్మికంతో గడపడం.
*8. సఖ్యత్వము :*
సఖ్యత్వము అంటే ఆయన నీకు ఒక మిత్రుడుగా భావిస్తూ నీకు మరియు ఆయనకు ఒక ఆధ్యాత్మిక సంబంధాన్ని ఏర్పరచుకొని జీవించడం.
*9. ఆత్మ నివేదనము :*
ఆత్మ నివేదనము అంటే సంపూర్ణ శరణాగతి అంటే సమస్తము నువ్వే నాది అంటూ ఏది లేదు అని జరిగే ప్రతిది నీ మూలంగానే జరుగుతుందని, నీకు నువ్వు సంపూర్ణంగా శరణాగతి కావడమే.
ఈ విధంగా మనం నవవిధ భక్తి మార్గాలను తెలుసుకొని వాటిలో ఏదైనా ఒక మార్గమును మనస్పూర్తిగా అనుసరించిన ఎడల మనలను మనము, ఈశ్వరుని దగ్గరికి చేర్చుకోగలము...
*శివో రక్షతు! శివో రక్షతు!! శివో రక్షతు!!!*
...... ఓం నమో వేజ్ఞ్కటేశాయ
Nagarajakumar.mvss

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి