* లలితగీతం *;- కోరాడ నరసింహారావు.. !

 పల్లవి :- 
     కల్మషం లేని పిల్లల నవ్వులు 
 నిర్మలమైన విరిసిన పువ్వులు
   నిజమైన హాయినిచ్చును... 
  మనసు  తేలికై  పోవును... !2
        "కల్మషం లేని..... "
చరణం :-
          ఆనందించగె పుట్టాము 
అది , పుట్టినంతనే మరిచాము 
ఏడుస్తూనే ఎదిగాము,... 2
 ఆ ఏడుపు తోనే చేస్తున్నాము 
 ఆ  ఏడుపు తోనో చస్తున్నాము
          " కల్మషం లేని...... "
చరణం :-
 పొందినదానితో తృప్తిచెందము
అందని దానికి  ఆశపడుదుము 
బ్రతుకంతా తీరని ఆశలు.... 2
తీర్చుకోలేని వెతలై, మనిషిని... 
 కడదాకా పీడిస్తున్నవి... 2
        " కల్మషంలేని..... "
      ******
కామెంట్‌లు