తెలుగు జాతీయం.;- తాటి కోల పద్మావతి గుంటూరు

 మూడో కన్ను.
శివుడికి మూడు కన్నులున్నాయి. ఒకటి సూర్యుడు రెండవది చంద్రుడు అయితే మూడోది అగ్ని-ఈ మూడో కన్ను తెలిస్తే అగ్ని కురుస్తుంది. అందుకని ఆయన దానిని ఎప్పుడూ మూసే ఉంచుతాడు. మన్మధుడిని దహించడానికి ప్రళయాగ్నిని సృష్టించడానికి ఆ కన్ను తెరుస్తాడు. ఇదేవిధంగా మూడో కన్ను గలవాడు శిశుపాలుడు. వీడి మూడో కన్నుకు అంత మహత్యము లేదు. అది వాని వికృతత్వానికి మొలిచింది. శ్రీకృష్ణుని వలన వాని మూడో కన్ను ఊడిపోతుంది. భృగు మహర్షికి అరికాలలో మూడో కన్ను ఉండేది. దాన్ని కాస్త విష్ణుమూర్తి సేవా తత్పరతతో చిదిమి వేసి, భృగు మహర్షిని శాంత పరిచాడు. ఈ మూడో కన్నును మన పెద్దలు జ్ఞాన నేత్రమంటున్నారు. ఇది ఎవరికి కనబడనిది. శివుడికి కోపం వస్తేనే మూడో కన్ను తెలుస్తూ ఉంటాడు. అతడు లయకారి. అందుకే జన సమాజంలో మహా కోపంగా ఉన్నవాడిని వానికి మూడో కన్ను ఉంది. వాడు మూడో కన్ను తెరిస్తే బాగుండదు అంటారు. అందుకే సామాన్య దృష్టిలో మూడో కన్ను అంటే పిచ్చి కోపమే. ఉగ్రతవమే.

కామెంట్‌లు