తొలి పొద్దు "దారిదీపమే!";-- యామిజాల జగదీశ్
 1
నాకు జన్మను ఇచ్చింది అమ్మ
నాకు జీవితాన్ని ఇచ్చింది నాన్న...
...
ఈ లోకానికి నేను ఏమిస్తానో తెలియదు
కాని మా అమ్మానాన్నలకు సంతోషాన్నిస్తాను
- ఎ. కావ్య (పదో తరగతి)
2
గాలిపటం గగనానికి ఎగురుతుంది
దానికి ఆధారమైన దారం ఎవరికీ కనబడదు
మనుషులు గొప్ప వ్యక్తులు అవుతారు
దానికి కారణమైన గురువులు ఎవరికీ కనబడరు
- కె. నవ్య (పదో తరగతి)
3
స్వార్థము లేని వృక్షమా
మానవాళికి నీవే రక్షణ
నీవు పెరుగుతావు మెల్లగా
నీ నీడ ఉంటుంది చల్లగా
- టి. నవాస్ రెడ్డి (తొమ్మిదో తరగతి)
4
తెలంగాణ సాంస్కృతి ప్రతీక
ఆడపడచుల ఆనందాల పతాక
తొమ్మిది రోజుల బతుకమ్మ పండగ
తీరొక్క పూలతో పేరుస్తూ
ప్రకృతి సౌందర్యాన్ని కీర్తిస్తూ
కన్నుల పండుగగా చేసుకునే వేడుక
- సిహెచ్. దీక్షిత (బతుకమ్మ కవితలో - పదో తరగతి)
ఇలా చిన్న చిన్న మాటలతో బాలబాలికలు అల్లిన నలబై కవితలతో ముచ్చటైన ముఖచిత్రంతో ముద్రించి పాఠకలోకానికి అందించిన సంకలన కర్త మీసాల సుధాకర్ (పి.జి.టి. తెలుగు)కు ధన్యవాదాలు. ఆయనకు సహకారం అందించిన స్వర్గం నర్సింహులు, పర్వీన్ లకు కూడా కైమోడ్పు.
జనగామ జిల్లా విద్యా శాఖాధికారి సిగసారపు యాదయ్య నలబై కవితలతో కూడిన ఈ "తొలిపొద్దు"లోని బాలబాలికలకు ఆశీస్సులు అందిస్తూ ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులు చాలా ప్రతిభావంతులు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదనడంతో ఏకీభవిస్తాను. వారిని సానబెట్టినట్లయితే మెరికల్లా తయారవుతారనేది అక్షరసత్యం. అమ్మ భాషలోని మాధుర్యాన్ని అవగాహన చేసుకోవడానికీ ఆస్వాదించడానికీ కవితా ప్రక్రియ అన్ని విధాల దోహదపడుతుంది. కనుక పిల్లలతో ఇటువంటి కవితలు రాయించి వారిలోని ప్రతిభను వెలికి తీయడంలో ప్రధానాచార్యులు శ్రీమతి కర్ల కృష్ణవేణిగారి ఉపాధ్యాయ బృందం చేస్తున్న కృషి అభినందనీయం.
ప్రతులకు: 
Principal,
TSMS Bachannapet,
Mdl. Bachannapet,
Dist. Jangaon, 506221.
Cell 9951972225

కామెంట్‌లు