లలితగీతం :- కార్మిక, కర్షక...... ;-కోరాడ నరసింహా రావు... !

 పల్లవి :- 
        కార్మిక, కర్షక సోదరులు, రక్షణనిచ్చే సైనికులు దేశ ప్రగతికి సోపానాలు... !మీరే భారతమాతకు ముద్దు బిడ్డలు. 
      "కార్మిక, కర్షక..... "
చరణం :-
   తర, తరాల పరాయిపీడనలో తల్లడిల్లినమాతృభూమిని,ఎన్నెన్నో  బలిదానాలతో చెరవిడిపిం చినవీరపుత్రులు..మీరేమనభారతమాతకు ముద్దుబిడ్డలు  !
     "కార్మిక, కర్షక.... "
చరణం :-
        జన్మ మెత్తినందుకు, కన్నరుణం తీర్చు కొనగ ,కృతజ్ఞ తనుచూపాలి  !
  శక్తివంచనలేకుండాశ్రమదానం చెయ్యాలి,కృతఘ్నులముకా ముమేమనినిరూపించుకోవాలి!
      "కార్మిక, కర్షక.... "
   *******
కామెంట్‌లు