సుప్రభాత కవిత ; - బృంద
మబ్బులు మసిలే గగనం
మొగ్గలు విరిసే భువనం
మసకలు తొలగిన సమయం
మెరుపులు చిందిన ఉదయం

వెేకువ రాగాల 
సవ్వడి మౌనం
మక్కువ మాటున 
మాటలు మౌనం

మల్లెల తరగని సంపద 
పరిమళం 
అది మోయలేని మది హాయి
పరవశం

తడియారని మమతల
తడిమేసే తలపులు
జడి ఆగని జ్ఞాపకాల  
గనుల తవ్వకాలు

తమస్సులో వచ్చే జ్యోతి 
వెలుగులు
మనస్సులో తెచ్చు కోటి
ఉషస్సులు

గుండె లోతున దిగుళ్ళన్నీ
ఉండిపోవు మనతోనే!
బండబారిన రాతిలోనూ
చెమ్మనుంచు దైవమే!

కోటి వెలుగుల రథము పై
మేటి వరముల మూట తెచ్చే

మనసైన ఉదయానికి

🌸🌸 సుప్రభాతం 🌸🌸


కామెంట్‌లు