జోధ్పూర్ లోఓగ్రామం ఖెజలడీ.ఇక్కడ ఖెజడీ అనే పేరు గల చెట్లు చాలా ఉన్నాయి. జోధ్పూర్ మహారాజా అభయసింహ్ కోట నిర్మాణంకోసం ఆచెట్లు కొట్టించాలని దివాన్ కి చెప్పాడు. ఇంకేముంది?రాజు తల్చుకుంటే దెబ్బలకి కొదవా? కానీ ఆపల్లెవాసులు చెట్లు నరకడానికి వీల్లేదు అని గట్టిగా ఎదురు తిరిగారు. అంతే కోపంతో రాజు సైన్యంని పంపాడు.అంతే ఒక్కక్కరు ఒకచెట్టుని గట్టిగా వాటేసుకుని నించున్నారు.సైనికులు కత్తులతో వారిని నరికి పోగులు పెట్టారు. అలా తొలి సారి అమృతాదేవి అనే ఆమె బలిఐంది.అలా 272 మందిని కత్తులతో చంపారు.నేలంతా రక్తపుటేరులు !సైనికులు ఖంగుతిన్నారు."ప్రభూ! శత్రువులతో పోరాడి చంపగలం కానీఅమాయక పల్లీయులను బలిచేయలేము" అని చెప్పారు.రాజు గుండె కూడా కరిగిపోయింది. వెంటనే అతను ఆపల్లెకు వెళ్లి ఆఇసుకలో మోకాలి పై నిలిచి ఆజనాలని క్షమాపణ కోరాడు. ఇది ప్రపంచంలోనే చెట్లకోసం ప్రాణాలు కోల్పోయిన మనీషుల వీరగాథ! దీన్ని ఉదాహరణగా తీసుకునే చిప్కో ఆందోళన మొదలైంది. భారతీయ సంస్కృతి లో వనదేవత జలదేవత అని ప్రకృతిని ఆరాధించడం ఓభాగం🌹
వృక్షాలపై ప్రేమ! అచ్యుతుని రాజ్యశ్రీ

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి