శబ్ద సంస్కృతి! అచ్యుతుని రాజ్యశ్రీ

 ఛత్తీస్ గఢ్ అంటే ముసల్మానుల  శాసనకాలం లో మండలాల బదులు గఢ్ అనే పద ప్రయోగం ఉంది. మహాకోశల్ (దీని అసలుపేరు)లో 36కోటలు కందకాలుఉండేవట!బెంగాల్ లో ఒక జిల్లా పేరు చౌబీస్ 24పరగణాలు అని పేరు. చేదీస్ గఢ్ అనేది ఛత్తీస్గడ్ గా మారింది అని ఇంకో కథనం.రతన్ పుర్ రాజులను చేదీశ్ అంటారు. హైహయవంశరాజులు చేదీయవంశం వారు.వీరికి 18 రత్న పుర్ 18 రాయపుర్ గఢ్ లు ఉండేవి. ఆపై 42గఢ్ లు ఐనాయి.11_12 శతాబ్దంలో హైహయరాజులు మహాశక్తి శాలురు.800ఏళ్ళు పాలించారు. వీరి రాజధానులు 
రత్న పుర్  ఖల్వాటికా రాయపుర్!ఒకప్పుడు  కోసల అనే పేరున్న ఈప్రాంతం ఉత్తర కోసల(అయోధ్య రాజధాని)
దక్షిణ కోసల ఛత్తీస్గడ్ అనే పేరు తో విరాజిల్లాయి.దక్షిణందానికి మహాకాంతారా అనే పేరు పెట్టి పిల్చేవారు.ఈప్రాంతం లో గోండు జాతి వారు ఎక్కువ. అందుకే గోండ్వానా అని పేరు. నేడు రాయగఢ్  సర్గుజా బిలాస్పూర్ బస్తర్ మొదలైనవి ఇందులో ఉన్నాయి. 🌷
కామెంట్‌లు