శబ్ద సంస్కృతి!అచ్యుతుని రాజ్యశ్రీ

 మరాఠీ లో చౌహాన్ ని చవ్హాణ్ అని కూడా అంటారు. వీరు అగ్నివంశీయులు.వీరి గూర్చి ఓకథ ఉంది. విష్ణు మూర్తి  దూర్వాదళాలతో చేసిన  ఓబొమ్మను మంత్రం తో అగ్ని కుండంలో వేశాడు. అందులోంచి నాలుగు చేతులున్న పురుషుడు ఉద్భవించాడు.అతని చేతిలో ధనుస్సు ఉంది. ఆఉగ్రమూర్తి కి ఋషులు  చాపుహాని అని పేరు పెట్టారు. ఈచాపుహాని శబ్దం కాలక్రమేణా చౌహాన్ గా మారింది. 10వ శతాబ్ది నుంచి చౌహాన్ అనే పదమే వాడుకలో ఉంది. ఇంకో జనశ్రుతి ప్రకారం మౌంట్ ఆబూలో విశ్వామిత్రుడు యజ్ఞం చేయడం వల్ల ఈకులం ఆవిర్భవించింది. రాజపుత్రులలో చౌహాన్లు అధికపరాక్రమం గల వీరులు.పృధ్వీరాజ్ చౌహాన్ ఈవంశంవాడే! మహ్మద్ గోరీ ద్రోహం వల్ల పతనమైనాడు.భార్య సంయుక్త  కన్నతండ్రి జయచంద్ర పగతో అల్లుడికే ఎసరుపెట్టాడు.నార్త్ ఇండియా లో హిందూ రాజుల అనైక్యత వల్ల  తురుష్కుల దండయాత్ర తో భారత్ పరాయి పాలనలో మగ్గింది.🌹
కామెంట్‌లు