రాయాలి - జయా
రాయాలి
ఫలానా అంటూ లేదు
కానీ
ఏదో ఒకటి రాయాలి

చదువుతూ 
చదువుతూ
సగంలో పక్కన పెట్టేసిన 
పుస్తకం గురించో....

పిచ్చుక
గూడు కట్టుకోవడం
ఇంకా పూర్తి కాకముందరే
వాలిపోయిన చెట్టు గురించో...

ప్రియమైనవారి గురించి
పరుగులు పెట్టే మనసు గురించో...

ఏదో ఒకటి రాయాలి
అంతే....

అప్పటికిగానీ
నా రాత విశ్రమించదు


కామెంట్‌లు