తెలుగు జాతీయం.;-తాటి కోల పద్మావతి

 ఉప్పుతో 9:-
ఈ జాతీయం గ్రామీణ ప్రాంతాలలో ఎక్కువ వాడుకంలో ఉంది. మన ఆరు రసాలు అంటే రుచులు-వాటిని షడ్రుచులు అంటారు. ఒకటి కషాయం, అంటే వగరు, రెండు మధురం అంటే తీపి, మూడు లవణం అంటే ఉప్పు, నాలుగు కటువు అంటే కారం, ఐదు తికధం అంటే చేదు, ఆరు ఆమ్లము అంటే పులుపు ఈ విధంగా ఆరు రకాల తిండి పదార్థాలు ఉన్నాయి. భక్ష్యం అంటే తినేవి. బోజ్యం అంటే నమిలి మింగేది. పేయం అంటే తాగేవి. చోష్యం అంటే జుర్రుకునేది అంటే స్విప్ చేసేది. పిచ్చిలం అంటే గడ్డ కట్టింది. మొదటి షడ్రుచులు షడ్రసాలు. లవడా తో అని ఎందుకన్నారో తెలియదు. అసలు ఉప్పుతో 9 అంటే మృష్టాన్నం "అన్నమాట. పెరుగు, నెయ్యి ఈ రసాలలో చేరలేదు. కానీ మృష్టాన్నంలో అవి చేరి ఉంటాయి. కాబట్టి ఉప్పుతో 9 అంటారు."బ్రాహ్మణః భోజన ప్రియః"అనే నానుడి ఒకటి ఉన్నది. శ్రీనాధుడు మృష్టాన్న భోజన ప్రియుడని అంటారు. అసలు ఈ జాతీయానికి"సమృద్ధి"అని అర్థములో వాడుతారు.

కామెంట్‌లు