రామాయణం కేవలం ఒక పౌరాణికం కధ మాత్రమే కాదు, విజ్ఞాన భాండాగారం. మానవ సంబంధాలకు సంబంధించి ఒక్స్ ఎన్సైక్లోపేడియా. మానవజాతికి వచ్చే వెయ్యేళ్ళ వరకు ఎలా జీవించి తరించాలో తెలిపే ఒక వ్యక్త్వ వికాస పుస్తకం. ఇందులో నుండి ఒక మనిషి ఎలా ఉండాలో ,ఒక కొడుకు ఎలా ఉండాలో కూడా రాముడు దగ్గర నేర్చుకోవచ్చు. భర్త మీద ప్రేమను సీతను చూసి నేర్చుకోవచ్చు. అన్నదమ్ముల అనుబంధం ఎలా ఉండాలో రామలక్ష్మణుల నుంచి నేర్చుకోవచ్చు. హిందువుల పవిత్ర గ్రంథం రామాయణం. రామాయణం జీవిత విలువల్ని భోధించడమే కాదు.. వాటిని కాపాడేందుకు మార్గాలు చూపిస్తుంది. .ధైర్య సాహసాలు, సహనశీలత, పితృవ్యాఖ్య పాలన, ధర్మనిరపేక్షత, దయార్దగుణం.. ఇలా అనేక గుణాలు వున్నాయి కనుకే శ్రీరాముడిని సకలగుణాభిరాముడు అంటారు. మనిషి ఎలా నడుచుకుంటే.. దేవుడిలా పూజింపబడతాడో.. తరతరాలుగా ఎలా కీర్తింపబడతాడో తెలిపిన సజీవ సాక్ష్యం శ్రీరాముడు. క్షమ మూల ధర్మం .. ధర్మ మూల జగత్తు అని తెలిపిన రామాయణం చెప్పిన నీతులు మనం సర్వదా ఆచరించదగినవి. భర్త కష్టసుఖాల్లో సమానమైన భాగం పంచుకోవడమే పతివ్రత లక్షణమని సీతమ్మ రాముని తో అరణ్యానికి వెళ్ళడం ద్వారా తెలియజేస్తుంది. పతివ్రతల కన్నీరు భూమి పై పడితే అరిష్టమని సీతమ్మ కన్నీరు పెట్టినంతనే రావణుడి లంకా దహనం తో రావణుడి పతనము మొదలైనది.
దికావ్యం రామాయణం. రామాయణాన్ని చదవటం ద్వారా శత్రువులను అవలీలగా . స్త్రీలు రామాయణాన్ని విన్నా, చదివినా, రాముడి వంటి పుత్రుడు కలుగుతాడు. అదే పెళ్లికాని పడుచులు చదివినా, వినినా శ్రీరాముడి వంటి భర్త లభిస్తాడు. ఇంకా దీర్ఘాయుష్షు, సంకల్ప సిద్ధి, దైవానుగ్రహం కలుగుతాయి. రోగులు ఈ కావ్యాన్ని పఠించినా, ఆలకించినా దీర్ఘకాలిక రోగాలు ఉపశమిస్తాయి. అకాల మృత్యు దోషాలు తొలిగిపోతాయి.
రామాయణం విశిష్టత;- సి.హెచ్.ప్రతాప్
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి