" హుమయూన్ మసీద్ ";- కొప్పరపు తాయారు


 రెండవ మొగల్ చక్రవర్తి  హుమయూన్ చక్రవర్తి. ఆయన భార్య పేరు హమీదా భాను బేగం.
     ఆమె తన భర్త మరణానంతరం, ఆయనకి గొప్ప మసీదు నిర్మించాలని హీరత్" నుంచి చాలా గొప్ప ప్రసిద్ధ సుప్రసిద్ధ శిల్పకళాకారులను పిలిపించారు. వారు ఇద్దరు తండ్రి కుమారులు వారిచేత ఆ భవన నిర్మాణం చేయించారు 1562 లో ప్రారంభమైన నిర్మాణం 8 ఏళ్లకు పూర్తయింది.
    ఇందు ఉపయోగించిన నల్ల పసుపు రాళ్లు సున్నపురాయి కూడా ఎంచి ఉపయోగించారు. చతురస్రాకారంలో ఉంటుంది ఉద్యానవనం దాని చుట్టూ ఎతైన గోడలు నిర్మించారు. ఉద్యానవనంలో ఎత్తైన వేదిక మీద మసీదు చాలా బాగా కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది.  గోపుర శిఖరం, అందమైన చలువరాతి బురుజులు కనిపిస్తాయి.
           ఇదే ప్రప్రధమ శిల్పకళా వైభవాన్ని , మొగలుల గొప్పతనం కూడా చాటుతుంది. ఆ తరువాత ఎన్నో కట్టడాలు వచ్చాయి. తర్వాత మొదటిది తాజ్ మహల్ ఒకటి.
           మసీదు చుట్టూ ఉన్న  ఉద్యానవనాన్ని "చార్ బాగ్" అంటారు ఇది నాలుగు విడదీసి ఎత్తయిన బాటలు నీటి కాలువలతో నిర్మించారు ఇది మన భారతదేశంలోని మొట్టమొదటి ఉద్యానవనం మసీదు.
          దీని ప్రాంగణంలోనే అమీదా బేగం, మరి కొంతమంది మసీదులు, ఉన్నాయి 1993లో ప్రపంచంలో వారసత్వపు కలంగా గుర్తించబడింది గుర్తించబడింది ఈ మసీదు ప్రత్యేక శిల్పకళా ప్రాముఖ్యత  ఉన్నదిగా యునెస్కో పేర్కొంది.
కామెంట్‌లు