పూరించవోయ్
సమరశంఖమును
మేలుకొలుపవోయ్
సాహిత్యజగత్తును
వెలిగించవోయ్
అక్షరదీపాలను
తొలగించవోయ్
అఙ్ఞానాంధకారాలను
ప్రోత్సహించవోయ్
కవిపుంగవులను
వ్రాయించవోయ్
కమ్మనికవితలను
మురిపించవోయ్
మృదుమదులను
కలిగించవోయ్
సుఖసంతసాలను
పూయించవోయ్
కవనకుసుమాలను
ప్రసరించవోయ్
సుమసౌరభాలను
చూపించవోయ్
అందచందాలను
చేకూర్చవోయ్
ఆనందానుభూతులను
వేడుకొనవోయ్
వాగ్దేవివాత్సల్యమును
వెలువరించవోయ్
వాక్మాధుర్యాలను
చేపట్టవోయ్
వివిధకవనప్రక్రియలను
సుసంపన్నంచేయవోయ్
తెలుగుసాహిత్యమును
చిందించవోయ్
తేనెచుక్కలను
చూపించవోయ్
తెలుగుతియ్యదనాలను
చదివించవోయ్
చక్కనిరాతలను
చేకూర్చవోయ్
చిద్విలాసములను
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి