ఏ ఊరుకు
ఒక ప్లాన్ ఉండదు!!
ఆ ఊరును
ఒక ప్లానుగా గీస్తే
ఒక జంతర్మంతర్ లా ఉంటుంది!
ఒక పద్మవ్యూహం లా ఉంటుంది!!?
ఎవరు లోపలికి వెళ్లలేరు
తిరిగి బయటికి రాలేరు!!
కానీ
అక్కడే పుట్టి పెరిగిన వానికి
ఊరు ఊరంతా
ఒక మైండ్ మ్యాప్ లా ఉంటుంది!!
నిమిషాల్లో చుట్టి వస్తాడు!!
నిజానికి వానికి
పట్టణమంతా ఎంత!!?
బహుళ అంతస్తుల భవనాలు ఎంత!!!?
అక్కడే పెరిగితే
అక్కడే తిరిగితే!!!
అందుకే
ఎక్కడైనా పెరగాలి
ఎక్కడైనా తిరగాలి!!
అది
ఊరు కావచ్చు!
పట్టణం కావచ్చు !!
ప్రపంచం కావచ్చు!!!
ఇప్పుడు
పల్లె పట్టణం ప్రపంచం
అంతా ఒకటైందీ!!
వాడే సాంకేతికత ఒకటే
వాడే సాంకేతిక సాధనాలు ఒకటే
చదివే చదువు ఒకటే
సమాచారము అంతా ఒకటే!!!?
ఇప్పుడు
పల్లె పట్టణం ప్రపంచం అంతా ఒకటైంది!!!
Sunita Pratap teacher palem nagarkurnool dist 🙏
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి