తెలుగు జాతీయం.;-తాటి కోల పద్మావతి గుంటూరు

 ఆకాశ కుసుమం.
కుసుమము అంటే పుష్పము, ఆకాశ పుష్పము అని కూడా అనవచ్చును. ఆకాశానికి గగనం, నభం, అబ్రం, మేఘం అనే పర్యాయపదాలను కూడా వాడటం జరుగుతూ ఉంటుంది. పూలనేవి చెట్లకో, తీగలకో పూస్తాయి కానీ ఆకాశానికి పూయడం జరగని పని. అది అబ్బురము కూడా. అసాధ్యం కూడా. కుందేటికి కొమ్ము, కాకికి దంతాలు ఎంత అసత్యము ఆకాశానికి పువ్వులు అంత అసత్యము. అయితే ఈ సమాసాన్ని కూచుటలో గల భావం ఏమిటి? ఏమిటంటే, ఏమీ లేదు అనటానికి శూన్యం, హుళక్కి , అబద్ధం, అసాధ్యం అన్న అర్థాల కోసం ఈ జాతీయాన్ని వాడుతూ ఉంటారు. ఒకవేళ ఆకాశంలో ఉన్న దొరకని, అందని వస్తువునే భావానికి వాడుతారు, ఆకాశ కుసుమం అంటే దేవత వస్త్రం లాగా లేని వస్తువు అన్నమాట. అందని పారిజాత పుష్పాలని భావం.

కామెంట్‌లు