పరివర్తన ...!! (కథ )----సరళశ్రీ లిఖిత *--సికిందరాబాద్

 రణధీర్ అనే వ్యక్తి చాల దుర్మార్గుడు.
జాలి,దయ ఏకోశన లేని వాడు. దొంగతనాలు,దోపిడీలు చేసేవాడు. ఒకరోజు రణధీర్  ఆలోచనలో పడ్డాడు. ఏంటి నా జీవితం, నేను ఎందుకిలా అయ్యాను! బాహుశ తల్లిదండ్రులు లేక ఆనాధలా పెరగటం వలనేమో..అందరితో తిట్లు తింటూ,అందరి దృష్టిలో దుర్మార్గుడిలా..మంచి చెడు మరచి  మానవత్వంలేని మనిషిని అయ్యాను..
ఓ దుర్మార్గుడిలా ముద్ర పడిపోయాను. ఛా..ఏంటీ నా జీవితం.. ఛీఛీ అని తనను తానే అస్యహించుకున్నాడు. ఛఛ మనశ్శాంతి లేని జీవితం..
ఇక ఈ జీవితం చాలు నేను మారాలి..అని పరివర్తన చెందినాడు..
ఇక నుండి మంచిపనులే చేయాలి అనుకున్నాడు.. అందరు మనశ్శాంతి కై గుడికి వెళ్ళుతారుకదా! గుడిలో ఏం ఉంటుంది ఆ దేవుడు ఏం చేస్తాడో చూడాలి, రేపు నేను గుడికి వెళ్ళతాను అనుకున్నాడు. మరునాడు ఉదయం గుడికి బయలుదేరినాడు.
హఠాత్తుగా మార్గం మధ్యలోనే కుప్పకూలిపోయి ప్రాణాలు వదిలాడు.
           యమభటులు అతని తీసువెళ్ళుతూ వీడు దుర్మార్గుడు అందుకే నరకంలోకే తీసుకువెళ్ళాలి అన్నాడు. ఇంతలో ఇంకో భటుడు లేదు లేదు ఇతనిలో పరివర్తన కలిగి మనసును మంచివైపు మార్చుకున్నాడు అందుకే  స్వర్గానికి  తీసుకేళ్ళాదాం.. అని ఇద్దరు వాదులాడుతూ, సరే ఎందుకు వాదన పాపం పుణ్యం లెక్క చూస్తే సరి అనుకున్నారు..
     రణధీర్ ఇంటి నుండి దేవాలయానికి బయలుదేరిన మార్గం సగం పాపం సగం పుణ్యం అనుకుందాం.. ఇక రణధీర్ ఈ పాపం లో నుండి ఒక అడుగు పుణ్యం లో వేసిన అతడు పుణ్యత్ముడే అని చూడగా.. నిజంగా ఒక అడుగు పుణ్యం లో వేశాకే ప్రాణాలు వదిలాడు. అతనిలో  కలిగిన పరివర్తనే స్వర్గానికి మార్గం అయింది.
........................................................
 ఎంతటి దుర్మార్గులైన, వారు  పరివర్తన చెందితే పుణ్యత్ములైతారు.
కామెంట్‌లు