ప్రాసపదాలు;- కిలపర్తి దాలినాయుడు

1️⃣
మంచికైతకు ప్రాస
దండగుచ్చినపూస
చదువపెంచునుధ్యాస
ఓ చిన్ని "దానా"!
2️⃣
పద్యమందున ప్రాస
తెలుగుతల్లికి భూష
కూర్పరికియెకనికష
ఓ చిన్ని "దానా"!
3️⃣
ప్రాస పట్టిన కవిత
వెలుగులీనెడి సవిత
దానికుండును భవిత
ఓ చిన్ని "దానా"!
4️⃣
కృతులకూయల ప్రాస!
పద్యప్రాణముప్రాస
గేయదేహపు శ్వాస!
ఓ చిన్ని "దానా"!
5️⃣
ప్రాస కూడిన మెరుపు
ప్రాస వీడిన మరుపు
ప్రాస గుండెకు చరుపు
ఓ చిన్ని "దానా"!
6️⃣
రచనలందున ప్రాస
రగడలందున ప్రాస
రసరమ్యతలహేష
ఓ చిన్ని "దానా"!
7️⃣
యతికి తమ్ముడు ప్రాస
వెతికి కుమ్ముడు ప్రాస
శ్రుతిసుభగములఘోష!
ఓ చిన్ని "దానా"!
8️⃣
పాడగలదోయ్ పికము
పలుకగలదోయ్ శుకము
అంత్యప్రాసల పదము
ఓ చిన్ని "దానా"!
9️⃣
ప్రాస బాలలకింపు
ప్రాసభాషలకింపు
ప్రాభవము రెట్టింపు
ఓ చిన్ని "దానా"!
🔟a
నుడికారముల ప్రోవు
జాతీయముల తావు
ప్రాస పెంచెను లావు
ఓ చిన్ని "దానా"!
----------------------------------------
 
కామెంట్‌లు