తెలుగు వెలుగు సాహిత్య వేదిక, ఎస్.వీ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఉగాది జాతీయ సాహిత్య సంబరాలు,శతాధిక కవుల పురస్కారాల కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా చిట్యాల పట్టణానికి చెందిన కవిరత్న నాశబోయిన నరసింహ(నాన)కు ఎస్.వీ ఫౌండేషన్,తెలుగు వెలుగు సాహిత్య వేదిక జాతీయ అధ్యక్ష కార్యదర్శులు పి.ఆర్.ఎస్.ఎస్.ఎన్ మూర్తి,మోటూరి నారాయణ రావుల నుంచి ఆహ్వాన పత్రం అందుకున్నారు.హైదరాబాద్ శివార్లలోని పటాన్ చెరువులో ఈ నెల 30న జరుగనున్న జాతీయ సాహిత్య సంబరాలకు ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన వారు మాత్రమే కాకుండా తమిళనాడు, మహారాష్ట్ర,ఒరిస్సా,కర్ణాటక, యానాం తదితర రాష్ట్రాల నుంచి,దుబాయ్,సౌత్ ఆఫ్రికా దేశాల నుంచి దాదాపు 500 మందికి పైగా కవులు,సాహితీ వేత్తలు రాబోతున్నారని అన్నారు. ఉగాది కవితా పోటీలలో విజేతలకు జ్ఞాపికలతో సన్మానం,ఉత్తమ కవి బిరుదులు ప్రదానం, కవితాసంకలన పుస్తకావిష్కరణ ఉంటుందన్నారు. ఈ సందర్భంగా పుడమి సాహితీ వేదిక అధ్యక్షుడు చిలుముల బాల్ రెడ్డి,సాహితీ మిత్రులు,తోటి వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తదితరులు నరసింహను అభినందించారు.ఈ సంబురాలు తెలుగు భాషాభివృద్ధికి,తెలుగు సాహిత్య వికాసానికి దోహదం చేస్తాయనీ,ఈ అవకాశం తనకు దక్కడం అదృష్టంగా భావిస్తున్నానని నరసింహ తెలిపారు.
కవి నాశబోయిన నరసింహ(నాన)కు జాతీయ సాహిత్య సంబరాలకు ఆహ్వానం:

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి