గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్ కు తెలుగువెలుగు సాహిత్యవేదిక, హైదరాబాదు వారి జాతీయ సాహిత్య పురస్కారం
 తెలుగువెలుగు సాహిత్యవేదిక మరియు ఎస్.వి. ఫౌండేషను, హైదరాబాదు వారు ఆధ్వర్యంలో పటాన్ చెరువులో ఈనెల 30వ తేదీ ఆదివారం నిర్వహిస్తున్న జాతీయ ఉగాది సాహిత్యసంబరాలకు శ్రీ గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్ గారిని వ్యక్తిగతంగా ప్రత్యేకంగా ఆహ్వానించారు.
జాతీయ సాహిత్య పురస్కారానికి శ్రీ రాజేంద్రప్రసాద్ గారు ఎన్నికైనందుకు సహతెలుగు కవులు హర్షం ప్రకటిస్తున్నారు మరియు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. 
ఉగాది సాహితీ సంబరాల సంకలనంలో శ్రీ ప్రసాద్ గారి కవిత వరాలతెలుగు ఎన్నికయినది. కావున వారికి జాతీయ సాహిత్య పురస్కారం ప్రదానం చేయటం జరుగుతుంది. ఈ సందర్భంగా శ్రీ రాజేంద్రప్రసాద్ గారికి బిరుదు ప్రదానం, ఘనసత్కారం, జ్ఞాపికలను అందజేయటం మరియు తెలుగు బుక్ ఆఫ్ వరల్డ్  రికార్డ్స్ సర్టిఫికేట్ ప్రదానం అందజేయటం జరుగుతుంది. శ్రీ రాజేంద్రప్రసాద్ గారు మరెన్నో సన్మాన సత్కారాలు అందుకోవాలని సాహితీ ప్రియులు కోరుకుంటున్నారు.

కామెంట్‌లు