తెలుగు జాతీయం కలగూరగంప.;-తాటి కోల పద్మావతి

 గంపలో రకరకాలైన కూరగాయలు ఉండును. కలగూర గంప అంటే వివిధ రకములైన కూరగాయలు కలిసి ఉన్న బుట్ట. గంపలో ఒక కూరగాయనో, ఒక ఆకుకూరనో, ఒకే రకం పండ్లను పెట్టి అమ్ముకుంటారు. ఇంకొందరు ఆకుకూరలు, పళ్ళు అమ్ముకుంటూ మోసి -అట్లాగాక భిన్న జాతులకు చెందిన కూరగాయలను, ఆకుకూరలను పండ్లను కలిపి బుట్టలో పెట్టితే అది కల కూర గంప అవుతుంది. గంప లేకపోయినా రకరకాల కూరగాయలు ఉంటే కలకూర గంప అంటారు. పదబంధంలో"కల"అనేది కలసినట్లుండు, కలగాపులగంగా ఉన్నట్లుగా అర్థ విశేషంబు వాడుతారు. కలనేత ఒకటికి మించిన రంగుల దారాలు కలిసి ఉంటాయి. కలగాపులగంలో తెల్ల, పచ్చ, ఖాధ్యా ద్రవ్యాలు కలిసి ఉంటాయి. అలాగే కలగూర గంపలో భిన్న పదార్థాలు ఏవైనా కలిసి ఉండవచ్చు.

కామెంట్‌లు