అందుకే ఈ పిలుపులు;- జగదీశ్ యామిజాల
"రామా!"

శ్రీరామచంద్రుడిని దశరథ చక్రవర్తి మాత్రమే రామా అని పిలిచేవారట. తండ్రి అనే చనువుతో ఆయనకలా పిలిచే హక్కు ఉంది.

తల్లి కౌసల్య "రామభద్రా" అని పిలిచేది. ఈ పిలుపులో తల్లి వాత్సల్యం మిళితమై ఉంది.

పిన్ని కైకేయి "రామచంద్రా" అని పిలిచేది. పిల్లాడుగా ఉన్నప్పుడు రాముడు ఆకాశంలో ఉన్న చంద్రుడ్ని కావాలని ఏడ్చినప్పుడు కైకేయి అద్దంలో చంద్ర బింబాన్ని చూపించి రాముడి ఏడ్పు మాన్పించింది. ఈ కారణంగా "రామచంద్రా" అనడం సమయోచితంగా ఉంది. 

బ్రహ్మర్షియైన వశిష్ఠులవారు "వేధసే" అని సంబోధించేవారు. శ్రీరాముడు పరతత్వం అని తెలిసి అలా సంబోధించే వారు.

అయోధ్య నగర ప్రజలు తమ "రఘువంశ రాజు" అనే అర్థంలో "రఘునాథ" అని పిలిచేవారు.

సీతాదేవి "నాథా" అనే పిలిచేది. అలా పిలిచే హక్కు ఒక్క సీతాదేవికి మాత్రమే ఉంది.

మిధిలా నగర ప్రజలందరూ తమ సీతాదేవి పతి అని అభిమానంతో "సీతాయపతయే" అని అనుకునే వారు.

ఇంతకూ ఇవన్నీ కూడిన ఆ శ్లోకం ఇదే...

రామాయ రామభద్రాయ 
రామచంద్రాయ వేధసే ।
రఘునాథాయ నాథాయ 
సీతాయాః పతయే నమః ॥ 

ఇది ఎంతో ప్రసిద్ధి చెందిన శ్లోకం. పది మందీ చెప్పుకునే కానీ ఈ పదప్రయోగాలలో ఉన్న అంతరార్థాన్ని మనసుని ఇట్టే

కామెంట్‌లు