సుప్రభాత కవిత ; -బృంద
చుక్కలకు రెక్కలొచ్చి
ఎగిరిపోయాయి
చీకటికి భయమేసి
వెలుతురు వెనుక
దాక్కుంది.

మాయమైన చుక్కల్ని
మబ్బులు హడావిడిగా
వెదుకుతూ చకచకా
తరలి పోతున్నాయి

వెలుగులు వస్తాయని
వేకువ కోసం వేచిన మదికి
స్వప్నం సాకారం అయేలా
సత్యం సహకరిస్తుందని
స్వర్గం సాక్షాత్కరిస్తుందని ఆశ

చీకటెలా ఉండిపోదో
వెలుతురూ అలాగే నిలిచిపోదు
కాలచక్ర గమనంలో
ఒకటి తర్వాత ఒకటి

ఓర్పు సహనం తో
స్నేహం చేయాలి
నిర్లక్ష్యం అలసత్వానికి
శత్రువు కావాలి

విధికి కేవలం వేదనేకాదు
వేడుకనూ తేవడం వాడుకేగా!
రేపటి కోసం ఆ

శగా చూడ్డం
మనకూ ఆలవాటేగా!

🌸🌸 సుప్రభాతం 🌸🌸
కామెంట్‌లు