-అందరూ బాగుండాలి... -అందులోమనముండాలి.!!;- కోరాడనరసింహా రావు.

  మనం సుఖ, సౌఖ్యానందాల తో కలకాలం వర్ధిల్లాలనిత్రికరణ శుద్దితో మనఃపూర్వకముగా కోరుకునిచిరునవ్వుతో  చెప్పేవే  శుభాకాంక్షలు... !
     పుట్టినరోజు మొదలుకుని జరిగే ప్రతిశుభ కార్యమూ శుభప్రదంగా జయ ప్రదం  కావా లని కోరుకుని వేసే నాలుగు అక్షి తలతోనో ...పలికేరెండుపలుకులతోనో ...మనసా,వాచా,కర్మణాకోరుకుంటూ తెలియజెప్పేవే  శుభాకాంక్షలు... !
     అందరూ బాగుండాలి... అం దులో మనమూ ఉండాలి, అని ప్రతిఒక్కరూ కోరుకుంటే.... 
  ఈ సమాజము ఆనందనంద నమే కదూ...!
         ప్రతి ఒక్కరూ సాటివ్యక్తి  బాగుండాలని  కొరుకుంటూ చిరునవ్వతో శుభాకాంక్షలు తెలియజేస్తూ చేతనైన సహకా రాన్ని అందించ గలిగితే...సమా జమంతా శాంతి, సౌఖ్యాలతో వెల్లివిరియాదా.... !
    గుండెలనిండా క్రోధాన్ని, బుర్ర నిండా విషాన్నీ నింపుకుని రాని  నవ్వును బలవంతంగా రప్పిస్తూ... ఆ ల్  ది  బెస్ట్! అనో 
 శుభాకాంక్షలుఅనోపైకిమాత్రమే  చెబుతూ... ఆవ్యక్తి వినాశాన్నే కోరుకుంటే...., 
      ఆ వ్యక్తికేమీ కీడు జరగదు!
గానీ, ఆ జరిగే కిడంతా ఈ వ్యక్తికే !!
యత్ భావం... తత్ భవతి !!
 ఇది అక్షరసత్యం... !
   అందుకే...కేవలంపైకిమాత్రమే 
కాదు మనస్ఫూర్తిగా ఎదుటివారి మేలునుకోరి చెప్పాలి శుభాకాంక్షలు !
నువ్వు చెప్పిన శుభాకాంక్షలు 
మొదట నీకే శుభాలను చేకూరుస్తాయి, తరువాతే అవతలి వ్యక్తికి !
  కనుక  అందరూబాగుండాలని
కోరుకుంటూవారికిశుభాకాంక్షలు తెలియజేయి..., 
వాళ్లతోపాటు... నువ్వూ బాగుంటావ్... !!
    *******
కామెంట్‌లు