గీచిపోవా బాలి;- కిలపర్తి దాలినాయుడు
(ప్రముఖచిత్రకారుడు బాలిగారిస్మృత్యర్ధం)
—---------------------------------------
నీదు కుంచెను వాలి
చిత్రమై బ్రతకాలి
గీచిపోవా"బాలి"
ఓ క్రోక్విలమ్మా!

ప్రాధేయపడు శూలి
మరుడు మరి బ్రతకాలి
గీచిపోవా 'బాలి'
ఓ క్రోక్విలమ్మా!

ఇంద్రాది దేవతలు
ఇలస్ట్రేషను ప్రియులు
'బాలి' కుంచెను వ్రాలు
ఓ క్రోక్విలమ్మా!

నవ్వించు మీగీత
నర్తించు మీ గీత
'బాలి' మీకిదె జోత
ఓ క్రోక్విలమ్మా!

వంటింటి హాసాలు
పక్కింటి వేషాలు
'బాలి' చే కార్టూన్లు
ఓ క్రోక్విలమ్మ!
—------------------------------------------


కామెంట్‌లు