సుప్రభాత కవిత ; -బృంద
చూపులు అల్లే 
తూరుపు రంగులు
గడియను తీసే
బంగరు వెలుగులు.

ఎదురు చూసిన 
జ్యోతి కలశం
ఒలికించెను  భువిపై
కాంతి పుంజం

వికసించిన సుమబాలల
సుగంధ పరిమళం....
చుట్టుముట్టెను 
అవని మొత్తం

పుడమి పైని వెలుతురు
పుత్తడిలా వెల్లి విరియ
చిత్తరువై నిలిచి చూసిన
వెండి మబ్బులు

సృష్టి  మొత్తం నిదుర లేచి
వెలుగులలో జలకమాడి
కొత్త సొగసుల సంతరించుకుని
మురిసి పోయిన తరుణం

జగతికి హితమును
రమ్యముగా ప్రసాదించి
ప్రతి అణువునూ పలకరించే
హిరణ్యుడి కిరణం.

గగనవీధిలో అరుణోదయం
భువనమందు సూర్యోదయం
మనసులకు మరో ఉదయం
అందరికీ ఇదే  నవోదయం

🌸🌸 సుప్రభాతం 🌸🌸


కామెంట్‌లు