టిబెట్!అచ్యుతుని రాజ్యశ్రీ

 ఆరోజు టీచర్ పిల్లలని అడిగింది "ప్రపంచపు పైకప్పు అని దేనికి పేరు?"వెంటనే శివా అన్నాడు "టిబెట్ కి టీచర్! ప్రస్తుతం చైనా లో భాగమైంది. దీని రాజధాని లాసా!500ఏళ్ళ పాటు  మతాధిపతి దేశాధినేతగా పాలించిన ప్రాంతం. ఆయన ని దలైలామా అంటారు. జ్ఞాన సముద్రం అని ఆపదానికి అర్ధం. మంగోలియన్ రాజులు ఇచ్చిన  బిరుదు అది.ప్రస్తుత దలైలామా  1959 లో తన 25వ ఏట టిబెట్ సైనికుడివేషంలో 14రోజులు  యాక్ జంతువు పై పయనించి మన దేశంలోని ధర్మశాలలో ఉంటున్నాడు.టిబెట్ లో అధిక జనాభా హాన్ జాతి చైనీయులు. చాలా కొద్ది మంది మాత్రమే అసలుసిసలు టిబెట్ వాసులు.ఉర్లగడ్డలు బార్లీ తప్ప అక్కడ ఏమీ పండదు.యాక్ జంతువు పాలు జున్ను తింటారు. అది భూమి దున్నడంలో రవాణా కి ఉపయోగపడుతుంది. వారి ఆరాధ్య దైవం బుద్ధుడు. మహాకాల తార శ్రీదేవి వారి దేవతలు.చైనా రాణి వెన్ చాంగ్ టిబెట్ రాజు ని పెళ్లాడటంతో బౌద్ధ మతం ఇక్కడ ప్రవేశించింది.దలైలామాకి ఆశ్రయం ఇచ్చిన మన దేశాన్ని వారు పవిత్రంగా భావిస్తున్నారు. ఆగౌరవంని అసలు సిసలు టిబెట్ వాసులే ఇస్తారు. " పిల్లల కి బాగా అర్ధం ఐంది మన దేశ గొప్పతనం🌹
కామెంట్‌లు