శబ్ద సంస్కృతి! అచ్యుతుని రాజ్యశ్రీ
 అస్త్రం అంటే ఆయుధం.సంస్కృత అస్ ధాతువు నుండి వచ్చింది.విసిరివేయుట అని అర్థం.శత్రువుపై బల్లెం బాణం విసిరి చంపటం అన్నమాట.ఆది ఆటవికులు అడవిలో ఉండి రాళ్ళు కర్రలతో జంతువులు శత్రువులపై దాడి చేసేవారు.మహాభారతంలో మంత్రం తో శత్రువుపై దాడిచేశారు.జృంభాస్త్రం అలాంటిదే! ఇప్పుడు మనం వాడే ఆయుధాలు అందరికీ తెలుసు.
అక్షయవటం పురాణం లో ప్రసిద్ధి.ప్రయాగలో గంగ యమున సంగమ ప్రాం తం లో ఉన్నాయి.ప్రళయం వస్తేఈజగత్తు నాశనం ఐనా ఈవృక్షంశాశ్వతం.దీన్ని పూజిస్తే సకల కార్యాలు సిద్ధిస్తాయి.
ఆచార్య అంటే వేదాధ్యయనం చేసేవాడు.గాయత్రీ మంత్రోపదేశం చేసేవాడు.గురువు ధర్మం తెలియజెప్పే వాడు.ఆదిశంకరులకు వైష్ణవ గురువులకు గూడా ఆచార్య పదం జోడింపబడుతోంది.6వశతాబ్దిలోజైన ఉపదేశకుల పేర్లు కూడా ఆచార్య తో మొదలు అవుతాయి.బిరుదుగా ఉపనామంగా 12వశతాబ్దిలో వాడారు.క్రమంగా వంటచేసేవారిని కూడా ఆచార్య అనటం వాడుకైంది.రాజస్థాన్ లో దహనసంస్కారాలు చేసేవారిని ఛార్జ్ అంటారు
ఆడంబరం అంటే డోలు సంస్కృతం లో.డోలు వాయించేవాడిని ఆడంబరఘాట్ అంటారు.ధ్వని కోలాహలం మేఘగర్జన ఏనుగు ఘీంకారంని కూడా ఆడంబర్ అనేవారు.దర్పం అభిమానం హర్షం క్రోధంవల్ల కోలాహలం కలుగుతుంది.కానీ ఆడంబరం అంటే గొప్ప డంబం‌కృత్రిమత్వం పటాటోపం అని అర్థం.తమిళులు ఆటంపరం అంటారు.
అంతెందుకు అంటే హిందీ లో భయం అని.కానీ సంస్కృతం లో ఆతంక్ అంటే రోగం జబ్బు.కానీ నేడు మనం టెర్రరిస్ట్ అనే అర్థంలో వాడుతున్నాం.

కామెంట్‌లు