సంజీవ దేవ్ గారు (1914 జులై 3 - 1999 ఆగస్టు 25)
మల్లాది రామకృష్ణ శాస్త్రి (1905 జూన్ 16వ తేదీ - 1965 సెప్టెంబర్ 12)
ఈ ఇద్దరూ మహామహులు. రచయితలు. లేఖాసాహిత్యంలో సంజీవ దేవ్ గారి శైలి చదువుతున్న కొద్దీ మళ్ళా మళ్ళా చదవాలన్నట్టు ఉంటుంది. ఈ ఇద్దరినీ ఎరుగుదును. మద్రాసులోని టీ. నగర్లో మల్లాదివారుండిన ఇల్లు మా ఇంటికి మూడు నాలుగు నిముషాల నడక దూరంలో ఉండేది. మా నాన్నగారికి ఏదో ఒక పుస్తకం ఇచ్చి దాని మీద వ్యాసం రాయించేవారు. నేను చిన్నప్పుడు ఇంగ్లీష్ కామిక్స్ పుస్తకాలు చదవడానికి ముఖ్యకారకులు మల్లాదివారే. ఆయన లైబ్రరీ ఎంత చక్కగా ఉండేదో మాటల్లో చెప్పలేను. ఆయన దస్తూరీ ముత్యాలే. ఇక సంజీవ దేవ్ గారి విషయానికి వస్తే సీనియర్ పాత్రికేయులు జి. కృష్ణగారివల్ల మొదటిసారి వినడం, కనడం హైదరాబాదులోని ఉస్మానియా యూనివర్సిటీ రోడ్డులో జరిగాయి. ఆయన కృష్ణగారికి ఒక తెలుగు పుస్తకం, ఒక ఇంగ్లీష్ పుస్తకం ఇచ్చారు. ఆ రెండింట్లో నేను తెలుగు పుస్తకం చదివి ఆయనకు నన్ను పరిచయం చేసుకుంటూ ఉత్తరం రాశాను. నా ఉత్తరం అందుకున్న వెంటనే ఆయన నుంచి ఉత్తరంతోపాటు ఓ చిత్రలేఖనం అందుకున్నప్పుడు పొందిన ఆనందం అనంతం. మా మధ్య ఓ అయిదారు ఉత్తరాల రాకపోకలు సాగాయి. ఉల్లిపొర కాగితం మీద ఆయన పరచిన మాటలు, మాటల్లోని భావాలు, భావాలకున్న సొగసు చిరస్మరణీయం. అటువంటి గొప్ప వ్యక్తి మల్లాది రామకృష్ణ శాస్త్రిగారికి దాదాపు అరవై ఏళ్ళ క్రితం రాసిన ఓ ఏడు లేఖలు నాకీ మధ్య ప్రముఖ రచయిత బ్నింగారి నుంచి అందాయి. ఇందుకోసం బ్నింగారికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఉత్తరాలలోకి వెళ్తున్నాను.....
ఈ ఏడు ఉత్తరాలలో మొదటిది సంజీవ దేవ్ గారు తమ గురించి చెప్తూ 1964 మార్చి 26వ తేదీన రాసిన ఉత్తరం. ఈ తొలి ఉత్తరంలో శ్రీయుతులు మల్లాది రామకృష్ణశాస్త్రిగారికి అని సంబోధించిన సంజీవ దేవ్ గారు "ప్రియమిత్రులు శాస్త్రిగారికి, అన్నగారికి, ప్రియమైన అన్నగారికి, శ్రీ మల్లాది అన్నగారికి" అంటూ మిగిలిన ఉత్తరాలను మొదలుపెట్టారు.
మొదటి ఉత్తరంలో సంజీవ్ గారు నన్ను ఆనందింపజేసే ప్రతిభ ఎవరిలో వున్నా వారికి ఉత్తరాలు నేనే ముందు వ్రాయటంలో గాణత్వాన్ని అనుభూతి చెందను. మీకు అలా వ్రాస్తున్నాను. అంటే మీ రచనా శిల్పం నన్నెంతగానో ముగ్ధుణ్ణి చేస్తూన్నదనే అర్థం. నా చిన్నతనంలోనే పత్రికల్లో మీ కథలు చదివి ఆనందించేవాణ్ణి.
మీ జవాబు అందుకొన్న తరువాత వివరాలతో వ్రాస్తాను. మీ చిరునామా తెనాలిలోని "విహారి" సంపాదకుల నుండి తీసుకొన్నాను, సెలవు మీ సంజీవ దేవ్ అని సంతకం చేశారు.
తమ తొలి ఉత్తరం రాసిన పది రోజులకు ఏప్రిల్ ఆరో తేదీన సంజీవ దేవ్ గారు మల్లాది వారికి రెండో ఉత్తరం రాశారు. ఈ ఉత్తరంలో సంజీవదేవ్ గారు తమ "రసరేఖలు" పుస్తకం గురించి, "ఉత్తరాలు" అనే వ్యాసం గురించి ప్రస్తావించారు. మనం ఒక పేజీ ఉత్తరాలే వ్రాసుకొందామంటారా miniature painting లాగా? Miniature painting ఎంత కష్టమో ఒక పేజీ ఉత్తరం కూడ అంత కష్టమైనదే....అంటూ ఈ రెండో ఉత్తరాన్ని ముగించారు సందీవ దేవ్.
1964 ఏప్రిల్ 23వ తేదీన సంజీవ దేవ్ గారు ఇంకొక ఉత్తరం రాశారు. మీ ఉత్తరం ప్రేమతో వ్రాసింది అందుకొని ఆనందించాను. ఈ మధ్య పోస్టులో ఉత్తరాలు పోవటం చాలా జాస్తి అయింది. అందుకని అనుమానించి మీకు నా 6వ తేదీ ఉత్తరం అందిందా లేదా అని అడిగేను. అంతే, మీరు మీ అలవాటు ప్రకారం ఆలస్యంగానే జవాబులు వ్రాయండి. తొందర లేదు....
నా ఆంగ్ల గేయాల మొదటి పంక్తులకు మీరు చేసిన స్వేచ్చానువాదం మనోరంజకంగా వుంది. అందుకు ధన్యవాదాలు.....అడిగిన పత్రికల వాళ్ళకు ఏదో కొద్ది కొద్ది రచనలు చేసి పంపుతున్నాను. జీవించటానికే సమయం చాలక పోతూంటే పైగా యీ రచనలొకటి. జీవించకపోతే మాత్రం ఏం, రచనలు చేస్తే చాలదా అంటే ఏం జవాబిచ్చేది? అని తమ రచనా వ్యాసంగం గురించి ఈ ఉత్తరంలో పేర్కొన్నారు సంజీవదేవ్ గారు.
1964 ఏప్రిల్ 25వ తేదీనాటి ఉత్తరంలో సంజీవ దేవ్ గారి మాటలు...
మా వూరు తెనాలికి ఉత్తరంగా పది మైళ్ళు. బెజవాడకు దక్షణంగా పది మైళ్ళు. మా రైలు స్టేషన్ పేరు చిలువూరు. అయితే ఏం. స్టేషన్ ఆనుకొనే తుమ్మపూడి. చిలువూరు దిగటమంటే తుమ్మపూడిలో దిగటమే అని తమ తుమ్మపూడి గురించి చెప్పారు.
జీవితంలోని వ్యతిరేకతలకు లొంగిపోకుండా వుండటం, పూర్తిగా కాకపోయినా కొంతకైనా నేర్చుకొన్నాను గనుక ప్రతి చిన్న బాధకూ కంపించిపోవటం అలవాటు లేదు అని చెప్పుకున్నారు.
1964 మే అయిదో తేదీనాటి ఉత్తరంలో...
మీరు నా Blind Girl అనే కవితకు మొదటి నాలుగు పంక్తులూ తెలుగు చేశారు గుర్తుందా?
“కనుల నిండ కరుణ నిండి
కనులెరుగని చిన్నదీ
పులుగడిగిన ముత్తెం వలె
పోణెమైన వన్నెదీ”
ఇది నాకెంతో బాగుంది. కొందరి మిత్రులకు ఉత్తరాలలో మీ అనువాదాన్ని పంపేను. చాలా మంది చాలా చాలా ఆనందించి ఆ మొత్తం కవితను అనువదిస్తే ఎంత బాగుంటుందో అని వ్రాశారు...అని తెలిపారు.
1964 జూన్ 1వ తేదీన రాసిన లేఖలో...
...ఇంటిలో ఎవరూ లేరు. ప్రస్తుతం సులోచనా, జోగేంద్ర మహేంద్రలూ బంధువుల వివాహాలకు వెళ్ళి వున్నారు. నేను అందువలన ప్రస్తుతం ఏకాంతంగానే వుంటున్నాను. ఏకాంతా లేకపోవటమే ఏకాంతం....ఊళ్ళో మా పిన్నిగారింట భోజనం చేసి వచ్చి మంచి నీళ్ళ కూజా దగ్గర పెట్టుకొని కూచొని కొంచెం సేపు చదువుకొని, కొంచెం సేపు వ్రాసుకొని, మరికొంచెంసేపు చిత్రించుకొని కాలం పుచ్చుతాను. పగటి నిద్ర అలవాటు లేదు. చదవటం, వ్రాయటం, చిత్రించటం బరువుగా తట్టినపుడు నడుము వాల్చి జరిగిన జీవితంలోని ఆనందమయ ఘడియలను జ్ఞాపకం చేసుకోడమో, జరగనున్న జీవితంలోని జ్యోతిర్మయ ఘట్టాలను గురించి పగటి కలలు గనటమో చేస్తూ వుంటాను. ఏ కాంతా లేని ఏకాంతం ఇందుకు బాగా ఉపయోగపడుతూంది అని చెప్పుకున్నారు.
ఈ ఉత్తరం తర్వాత వారి మధ్య కొన్ని నెలలపాటు ఉత్తర ప్రత్యుత్తరాలు సాగినట్టు లేదని 1965 ఏప్రిల్ 26న రాసిన ఉత్తరం ద్వారా తెలుస్తోంది.
అందులో ...." ఎందుకో మన ఉత్తరప్రత్యురాలు నిరుటి ఎండా కాలంలో ఆగిపోయినవి" అని చెప్పుకున్నారు.
"...సరే, మళ్ళీ మనం ఉత్తరాల్లో కలిశాం ఈ నెలలో. వచ్చే నెలలో మనుషుమే కలవబోతున్నాం. మే 17వ తేదీన సతీసతులతో – అంటే ఒక భార్యా ఇద్దరు అబ్బాయిలూ అని అర్థం లెండి... మదరాసులో దిగబోతున్నాను. వెంట చిత్రాలు కూడా తెస్తున్నాను..... మదరాసులో వుండగా మిమ్నులను తప్పక కలుసుకోగలము...నా రసరేఖలు పంపేను మీకు నిరుడు. తరువాత "సంజీవ దేవ్ లేఖలు" అని ఒక పుస్తకం ప్రకటించారు. అటు తరువాత భారతిలో వరుసగా వచ్చిన నా "తేజోరేఖలు"ను చిన్న పొత్తంగా ప్రకటించారు. ఇంకా అట్టలు వేయటం వగైరా పూర్తికాలేదు. ఆ రెండు పుస్తకాలనూ మదరాసులో మీకు అందిచగలను.
మదరాసులో మిమ్ము చూడనున్నట్టే మీ చేత చూడబడనున్నట్టే సులోచనా, 11 సంవత్సరాల జోగేంద్ర, మహేంద్ర (8 సం.) మీకు ప్రేమపూర్వకమైన వందనాలను పంపుతున్నారు.
సంజీవ దేవ్ ఉత్తరాలకు మల్లాదివారి ప్రత్యుత్తరాలెలా ఉండేవో తెలిస్తే మరింత ఆనందంగా ఉండేది. కానీ ఆ భాగ్యం లేకపోయింది నాకు. అయితేనేం ఈ మాటలతో ఇద్దరు ప్రముఖులనూ మళ్ళా నా జ్ఞాపకానికి తెచ్చిన బ్నింగారికి హృదయపూర్వక కృతజ్ఞతలు చెప్పడం కనీసధర్మం.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి