శబ్ద సంస్కృతి! అచ్యుతుని రాజ్యశ్రీ

 చౌధరీ అనేది ఓ పదవి.గ్రామ ప్రభుత్వ అధికారి.మరాఠీ లో చతుర్ధారీ అనే శబ్దం నించి వచ్చింది. బెంగాలీ ఒరియా భాషల్లో చౌధురీ  గుజరాతీ లో చౌధ్రీ అంటారు. చతుర్ధారీ అంటే అర్థం నాలుగు అధికారాలు కలవాడని. పోగు చేసేవాడు నలువైపులా సత్తా చాటేవాడు అని చెప్పొచ్చు. చౌధరీ పాటిల్ అని  అధికారిని సంభోదించేవారు. చౌధరీ అనే అధికారి మార్కెట్ వ్యాపారవ్యవహారాలు చూసేవాడు.కోల్ జాతి వారి  గ్రామ పంచాయతీ అధికారి ని కూడా చౌధరీ అంటారు. వంశపారంపర్యంగా వచ్చు పదవి.అపరాధిని కులం నించి వెలి వేస్తాడు. తమ కులం జాతి రక్షణ బాధ్యతలు వహిస్తాడు🌹
కామెంట్‌లు