వింతలు విశేషాలు! అచ్యుతుని రాజ్యశ్రీ
 ఇది చదివాక ఇలాంటి పిచ్చిమాలోకాలు ఉన్నారా అని అనుకుంటాం. పీట్సుబర్గ్  కి చెందిన ఓమేధావి వంద ఏళ్ళు గా  అర్ధం కాక సవాల్ విసిరిన పైన్ కెయర్ కంజెక్చర్ ని చిటికెలో పరిష్కరించాడు.అతని గదినిండా బొద్దింకలే! గ్రెగరీ అనే ఆమేధావికి 5కోట్ల రూపాయలు బహుమతి గా ఇస్తామంటే"నాకు ఆడబ్బు వద్దు బాబోయ్! నాకు కావల్సినవన్నీ ఉన్నాయి.ఆడబ్బు నేనేం చేసుకోవాలి!?" అని అమాయకంగా ప్రశ్నించాడు  ఆగణితమేధావి!
రాజస్థాన్ లో కొన్ని తెగల ప్రజల్లో పిల్లాడికి పెళ్ళి కావాలంటే కాబోయే అత్తగారికి మంచి చలాకీ ఖరీదైన కుక్కను  కన్యాశుల్కం గా ఇవ్వాలిట!దాని ఖరీదు 20వేల నించి ఒక  లక్షదాకా  ఉండొచ్చు. ఇసుక దిబ్బలపై నివాసం ఉండేవారు వేట జీవనాధారం కావడంతో మంచి వేటకుక్కని బహుమతి గా అడుగుతున్నారు వధువు వైపువారు.కుక్క ఖరీదు ని బట్టే పెళ్లి ఏర్పాటు కూడా ఉంటుంది. తమాషా ఆచారాలు కదూ?🌷

కామెంట్‌లు