భూ మాత ....కోరాడ నరసింహా రావు.
వేరే గ్రహమునకూ లేని అద్భుత గుణమీ రసాతలమునకే గలదు
  జీవినిపుట్టించి  ,వృద్ధినొందించు 
మహత్తరశక్తిగలదీ భూమాత !

ఎన్నెన్నో రంగులను, రుచులను సుగంధములనుకూడ దాచుకున్నది తనలోనే.... !!

 ఎనుబది నాలుగు లక్షల జీవ జాతుల నిలయమీవిశిష్ట  ధరిత్రి... !

సమృద్ధిగా నీరును, ప్రాణ వాయువును గలది ఈ  నేలతల్లి !

 నాలుగుభూతముల సర్వ శక్తులనూ, తనలోనే ప్రోదిచేసుకుని, పంచమ మహాభూతమై ఆవిర్భవించినది... ఈ మహత్తర పృధివీ మాత !

ఏడేడు పదునాల్గు లోకములలో... తనఅత్యద్భుత  ఉనికినిసగర్వంగా  స్పష్టపరచుతూ ఈ భూలోక గొప్పతనమును చాటి చెప్పుతున్నది... పురాణేతిహాసములతోడ... !!
      ******

కామెంట్‌లు