గాంధీ బాట!అచ్యుతుని రాజ్యశ్రీ

 ఆరోజు టీచర్ అడిగింది "పిల్లలూ! మీరు ఎవరి జీవితచరిత్ర చదివారు? దాన్నించి ఏంనేర్చుకున్నారు?"
శివా అన్నాడు "టీచర్!గాంధీజీ బాల్యం గూర్చి చదివాను. ఆయనకి  ఆటలు వ్యాయామం అంటే ఇష్టం ఉండేది కాదు. బాధ అనిపిస్తే ఏడ్చేవాడుట .ఫుట్బాల్ క్రికెట్  ఆడేవాడు కాదు. బాల్యం లో మహా బిడియం సంకోచం. అందుకే వృద్ధుడైన తండ్రికి సేవచేయాలని ఇంటికెళ్లి పోయేవాడు. కానీ వాకింగ్ చేసేవాడు. హెడ్మాస్టారు ఇది గ్రహించి వ్యాయామం క్లాస్ కి డుమ్మా కొట్టాడని ఓ అణా ఫైన్ వేశాడు. ఈవిషయం తెల్సి గాంధీజీ తండ్రి హెడ్మాస్టారుకి లేఖ రాశారు "మా అబ్బాయి నాసేవకై ఇంటికి వస్తున్నాడు. అబద్ధం చెప్పలేదు. మీరు జుర్మానా వేయకండి " అని. అలా తన అనుభవం లో గాంధీజీ తన చేతిరాత చాలా ఘోరంగా ఉంటుందని దక్షిణ ఆఫ్రికాలో యువకులు  వకీలువృత్తి వారిహాండ్ రైటింగ్ ముత్యాల కోవలా ఉండటం చూసి తాను చాలా సిగ్గు  పశ్చాత్తాపం చెందానని తన జీవిత చరిత్రలో రాశారు ఆయన.కాపీ రైటింగ్ బాల్యం లో రాయాలని చెప్పారు. అలాగే సంస్కృతభాష చదవడం కష్టంగా ఉంది అని ఫారశీ క్లాస్ కి వెళ్లాడు.అప్పుడు సంస్కృతమాష్టారు పిల్చి బుజ్జగించి"చూడు గాంధీ!సంస్కృతం లోమనదేశ సంస్కృతి గొప్పదనం ఉంది. ఆసాహిత్యం నీవు చదవాలి " అంతే భగవద్గీత ను అర్ధం చేసుకునే స్థాయికి ఎదిగారు బాపూజీ" టీచర్ శివా ని మెచ్చుకోలుగా చూస్తూ అంది"అందుకే మీరంతా గొప్పవారి జీవితచరిత్ర చదివి క్లాసులో చెప్పాలి.సరేనా?" అలాగే టీచర్ అంటూ పిల్లలు శివా కి అభినందనలు తెల్పారు🌹
కామెంట్‌లు