* బాలగేయం ";- కోరాడ నరసింహా రావు !
అమ్మకడుపు చల్లగా... 
   అత్తకడుపు  చల్లగా... 
  హాయిగా ఆడుతూ పాడరా !
  చదువులలోమేటివైవెలగరా!!

గొప్పగా ఎదగరా... 
  గతమునెపుడు మరువకురా 
నిన్ను అపురూపంగా పెంచిన అమ్మ, నాన్నలు..... 
అనురాగంపంచుతోడబుట్టినవారు.... 
అభిమానించి నిను  ప్రేమించిన వారు....
నీ ఆప్యాయత కొరకు ఎదురు చూస్తుంటారు... !...2  
 నీప్రేమపలకరింపుచాలు వారికి
అంతకన్నవారునిన్నుకోరేదేది!? 
   
అమ్మకడుపు చల్లగా... 
  అత్తకడుపు చల్లగా.... 
 హాయిగా ఆడుతూ పాడరా !
 చదువులలో మేటివై వెలగరా 
....... ******

కామెంట్‌లు