చతురత! అచ్యుతుని రాజ్యశ్రీ

మనం ఎంత తెలివితేటలు ఉన్నవారం ఐనాకూడా సమయస్ఫూర్తి చతురతతో పని చేయాలి.క్లాస్ లో పిల్లలు వాదించుకుంటున్నారు.ప్రశ్నకు జవాబు తప్పు రాశావని హరి శివాని మందలించాడు.శివా "నాది కరెక్ట్. నీదే తప్పు " అన్నాడు. హరి పాయింట్లు తన సొంతంగా  ఆలోచించి రాశాడు.శివా గైడ్ లోది ఎక్కించాడు. టీచర్ ఉపాయంగా అంది."మీ ఆలోచనబట్టి రాశారు.ప్రతిపాయింట్ గైడ్ లో ఉన్నట్లు మక్కికి మక్కి రాయనవసరంలేదు.మీకు ఓసంఘటన చెప్తా.ఓసారి కాన్పూర్ లో క్రికెట్ ఆడుతున్నారు పిల్లలు. అప్పుడు లాల్బహద్దూర్ శాస్త్రిగారు  యు.పి.హోంమినిష్టర్.విద్యార్థులకు పోలీసులకు మధ్య గొడవ వచ్చింది. "ఆఎర్రటోపీలు గ్రౌండ్ లో ఉంటే మేము మ్యాచ్ జరగనీయం" అని విద్యార్థులు డిమాండ్ చేశారు. శాస్త్రీజీ "ఇవాల్టికి ఆట కొనసాగనీయండి.రేపు ఒక్క ఎర్రటోపీకూడా మీకంటికి కన్పడదు."అని నచ్చజెప్పారు.
మర్నాడు గ్రౌండ్ లో పోలీసులను చూసి పిల్లలు రెచ్చిపోయి శాస్త్రిజీని నిలదీశారు. "చూడండి!ఆపోలీసుల నెత్తిన ఖాకీ టోపీలున్నాయి కానీ ఎర్రటోపీలు కాదుగా!?" అనేప్పటికి నోటమాటరాలేదు విద్యార్థులకు. అదీ చతురత సమయస్ఫూర్తి  అంటే!"
టీచర్ మాటలు వింటూ శివా హరి గొడవపడటం మానారు🌹 
కామెంట్‌లు