నమో తిరుమలేశా!!‌; - సునీతాప్రతాప్, ఉపాధ్యాయిని, పాలెం.
ఏడుకొండలు-ఏడు వింతలు
ఏడుకొండల ఘన కీర్తి
అన్నమయ్య వేల కీర్తనలు!!
అవే మా అందరి ప్రార్థనలు!!

మేఘాలు కిందికి దిగి
నీ పాదాలు కడిగి
ఆకాశం కిందికి వంగి
నీకోసం గొడుగయ్యే!!

తోటలోని పూలు ఫలాలు
నీ చోటికి చేరే
చల్లనయ్యా నల్లనయ్య
నిత్య కళ్యాణం పచ్చతోరణం
నీ ఏడు గడపలు!!

చల్లని నీ చూపులు
శ్రీదేవి దయా
దారి దీపాలు నీ భక్తులకు!!

దివ్య క్షేత్రం
దేవుళ్లందరిలో
ఒక నక్షత్రం-నీ పుణ్యక్షేత్రం!!

మా తలనీలాలు
చాలు చాలు మా పుణ్య ఫలాలు!!
ఒట్టి చేతులు కావు
వడ్డీ కాసులు నీ మొక్కుబడులు!!

నీ దర్శనం
నీ చుట్టూ మా ప్రదక్షణం
చాలు చాలంటివీ!!

మా కంటికి మా ఇంటికి
నీ రూపం ఒక వెలుగంటివి!!

నీ ముందు నిలబడితే
మా హృదయం చల్లబడే
నీకు నమస్కరిస్తే
మాకు ఆశీర్వాదం ఇవ్వబడే!!

నమో వెంకటేశా నమో తిరుమలేశా
నమో నమో!!

తిరుమలను దర్శించుకునే సందర్భంగా రాయబడిన కవిత.
Sunita Pratap teacher palem nagarkurnool dist 🙏
8309529273.

కామెంట్‌లు